టెలిగ్రామ్‌ లింకులను బ్లాక్‌ చేసిన వాట్సప్‌

Whats App Blocks Telegram Links

04:10 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Whats App Blocks Telegram Links

ప్రపంచవ్యాప్తంగా ఒక విలియన్‌ యూజర్లు కలిగిన వాట్సాప్‌ తన ప్రత్యర్ధి టెలిగ్రామ్‌ కు సంభందించిన లింక్‌లను బ్లాక్‌ చేసింది . టెలిగ్రామ్‌ సంభందించిన లింక్‌లు కేవలం టెక్ట్స్‌మేసేజ్‌ లాగానే వస్తుందే తప్ప హైపర్‌లింక్‌ రూపంలో రాకుండా వాట్సాప్‌ బ్లాక్‌ చేసింది . అంతేకాకుండా టెలిగ్రామ్‌ ఆప్‌కు సంభందించిన లింక్‌లను వేరే మధ్యమాల్లో కాపీ-పేస్ట్‌ చేసే వీలు లేకుండా చేసింది. దీంతో ఎవరైన్నా టెలిగ్రామ్‌ కు సంభందించిన లింకులను బ్రౌజర్‌లో ఓపెన్‌ చెయ్యాలి అంటే మనమే మొత్తం లింక్‌ను ఎంటర్‌ చెయాల్సి వుటుంది. ఈ విషయాన్ని స్వయంగా టెలిగ్రామ్‌ సంస్థ వారే ధృవీకరించారు. ఈ బ్లాక్‌కు వాట్సప్‌ వారిదే బాధ్యత అని టెలిగ్రామ్‌ తెలిపింది . దీనిపై స్పందించిన టెలిగ్రామ్‌ పతినిధి వాట్సాప్‌ చర్యతో తాము ఏమి ఆందోళన చెందడం లేదని అన్నారు.

వాట్సాప్‌ సంస్థ వారు మాత్రం వారు తీసుకున్న ఈ చర్యపై ఎటువంటి ప్రకటన చేయ్యకపోవడం విశేషం.

English summary

Famous Social Messaging App Whats App Blocked Its competetor Telegram links . When user sends any links regarding telegram app then the user unable to copy or we cannot go through that link. The user was unable send that link to any other social messaging apps also