వాట్సాప్‌కు వాట్ హ్యాపెండ్..

Whats App Goes Down For Two Hours

10:28 AM ON 27th January, 2016 By Mirchi Vilas

Whats App Goes Down For  Two Hours

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అత్యధిక స్మార్ట్ ఫోన్లలో వినియోగిస్తున్న సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌. ఇటీవల కాలంలో మరో సోషల్ మెసేజింగ్ యాప్ ట్విట్టర్ మాదిరిగానే వాట్సాప్ కూడా మంగళవారం దాదాపు రెండు గంటల పాటు ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల పనిచేయలేదు. వాట్సాప్‌ యూజర్లు ఈ విషయాన్ని.. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు. ఉదయం ట్విట్టర్‌ ట్రెండింగ్స్‌లో సైతం వాట్సాప్‌ డౌన్‌ కొనసాగింది. అయితే ఆ తర్వాత అది యథావిధిగా పనిచేయడంతో అంతా కుదుటపడ్డారు. వాట్సాప్‌ ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న మెస్సేజింగ్‌ యాప్‌ల్లో తొలిస్థానంలో ఉంది. 2014 ఫిబ్రవరిలో ఫేస్‌బుక్‌ సంస్థ దీన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్ డౌన్ పై ఫేసుబుక్ అధికారికంగా ఎటుంటి ప్రకటనా చేయలేదు.

English summary

Yesterday famous instant messaging app Whats App goes down for almost two hours in India and in four other nations.Today Whats App was in trending in Twitter and till now whats app officilas did not responded on this