వాట్సాప్‌ పరిమితి పెరిగిందోచ్..

Whats App Increased 256 Users In Group Chat

10:55 AM ON 5th February, 2016 By Mirchi Vilas

Whats App Increased 256 Users In Group Chat

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ కు అనుబంధ సంస్థ వాట్సాప్‌ తన మెసేజింగ్‌ యాప్‌లో గ్రూపు సభ్యుల పరిమితిని పెంచింది. ఇకపై ఒక వాట్సాప్ గ్రూపులో 256 మంది సభ్యుల వరకు ఉండొచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయం ఆండ్రాయిడ్‌ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. త్వరలోనే అన్ని ఓఎస్‌ల్లోనూ దీనిని అందుబాటులోకి తీసుకురానుంది. 2009లో ప్రారంభమైన వాట్సాప్ ఇటీవలే వంద కోట్ల యూజర్ల మైలురాయిని దాటిన సంగతి తెలిసిందే. తొలుత వాట్సాప్ యాప్‌లో గ్రూపు సభ్యుల సంఖ్య 50 వరకు ఉండేది. 2014లో ఫేస్‌బుక్‌ ఈ యాప్‌ను కొనుగోలు చేసిన తర్వాత.. గ్రూపు పరిమితిని 100 మంది పెంచింది. తాజాగా ఈ సంఖ్య 256కు విస్తరించడం విశేషం.

English summary

Worlds Popular instant messaging app Whats App increased the members in Group chat users.Previously whats app group chat users limit will be 100 and it was now increased to 256 members