వాట్సాప్‌ కస్టమర్లు  వంద కోట్లు

Whats App Reaches 100 Crores Customers

10:27 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Whats App Reaches 100 Crores Customers

ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ వంద కోట్ల(బిలియన్‌) మైలురాయిని అధిగమించింది. వంద కోట్ల యూజర్లు కలిగిన వాట్సాప్‌ ద్వారా రోజుకు 42(42బిలియన్‌) కోట్ల మెసేజ్‌లు బదిలీ అవుతున్నాయి. 1.6 బిలియన్‌ ఫొటోలు షేర్‌ అవుతున్నాయి. 1 బిలియన్‌ గ్రూపులు వాట్సాప్‌లో ఉన్నాయి. ఈ యాప్‌ను సోమవారం నాటికి వంద కోట్ల మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్న ట్లు లేక్కతెలింది. ఈ సందర్భంగా ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తమ యాప్‌ను ఆదరించిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో మరింత మందికి వాట్సాప్‌ను చేరువ చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆలాగే వాట్సాప్‌ సృష్టికర్తలు జాన్‌, బ్రెయిన్‌లను కూడా ఆయన అభినందించారు

యాహూ మాజీ ఉద్యోగులైన బ్రెయిన్‌ ఆక్టన్‌, జాన్‌ కోమ్‌ 2009లో వాట్సాప్‌ను స్థాపించారు. దీన్ని 2014 ఫిబ్రవరి 19న 19.3 బిలియన్‌ డాలర్లకు ఫేస్‌బుక్‌ కొనుగోలు చేసింది. అప్పటికి 50 మిలియన్లు ఉన్న యూజర్ల సంఖ్య కేవలం రెండేళ్లలో రెట్టింపయ్యింది. సంస్థను స్థాపించిన ఏడేళ్లలో ఈ ఘనత సాధించడం పట్ల వ్యవస్థాపకులు హర్షం వ్యక్తం చేశారు.

English summary

Worlds Number One Instant Messaging App Whats App reaches 100 crore users.On this occasion Whats App and Facebook CEO Mark Zucker Berg say thanks to its users to make it grand success and he also congratulated Whats App Founder John,Brain.In June 2014 February 19th Facebook Has Purchased Whats App