వాట్సాప్ కి కొత్తగా రిప్లై

Whats App To Bring Notification Reply Feature

10:17 AM ON 30th March, 2016 By Mirchi Vilas

Whats App To Bring Notification Reply Feature

అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో ఓ కొత్త వెసులుబాటు కల్పించబోతోంది. నోటిఫికేషన్‌ వచ్చినప్పుడు అక్కడి నుంచి రిప్లై ఇచ్చేందుకు వీలుగా ఈ యాప్‌కి ఓ అప్‌డేట్‌ వెలువడనుంది. అయితే ఇప్పుడు 2.12.560 పేరుతో ఓ బీటా అప్‌డేట్‌ గూగుల్‌ ప్లేలో సైనప్‌ అయి ఉన్న కొంత మందికి వచ్చింది. దాని ద్వారా వాట్సాప్‌ వినియోగదారులు వేగంగా రిప్లై ఇచ్చేందుకు వీలుగా నోటిఫికేషన్‌ నుంచే రిప్లై ఇచ్చే సదుపాయం కలిగింది. గూగుల్‌ ప్లే ద్వారాగాని, వాట్సాప్‌ వెబ్‌సైట్‌ ద్వారాగాని ప్రస్తుతం అందుబాటులో లేని. ఈ అప్‌డేట్‌ త్వరలోనే అన్ని ఫోన్‌లకూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్‌ వస్తే ఇక నోటిఫికేషన్‌ బార్‌లోనే ‘రిప్లై’ ఆప్షన్‌ కనిపించనుంది. ఇక ఎదురు చూద్దాం .

ఇవి కూడా చూడండి :

భారతీయుల కోసం ఐదు డేటింగ్ యాప్స్..

యూజర్లకు సారీ చెప్పిన 'ఫేస్ బుక్'

English summary

Whats App was working on a new feature, with this new feature user can give reply directly from the notification bar.This new updates will come soon to the users.