ఫేస్ బుక్ పై వాట్సాప్ కి కోపం వచ్చింది.. ఎందుకంటే?

Whatsapp company angry on Facebook

03:16 PM ON 29th September, 2016 By Mirchi Vilas

Whatsapp company angry on Facebook

రెండేళ్ల కిందట ఫేస్ బుక్, వాట్సాప్ ను సొంతం చేసుకున్నప్పుడు, రెండు కంపెనీల మధ్య ఎలాంటి డేటా మార్పిడి జరగదని వాగ్ధానం చేసిందట. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఫేస్ బుక్ వ్యవహరిస్తోందని టాక్. అసలు, వాట్సప్ డేటా ఫేస్ బుక్ సేకరించడం ఏమిటి? దీనికి ససేమిరా మేం ఒప్పుకోం అంటున్నాడు హాంబర్గ్ డాటా ప్రొటెక్షన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ జోహెన్స్ కాస్పర్. అసలు విషయానికొస్తే... ఇటు జర్మన్ యూజర్ల వాట్సాప్ డేటాను ఫేస్ బుక్ సేకరించడానికి, స్టోర్ చేయడానికి వీలులేదని ఆ దేశ ప్రైవసీ రెగ్యులేటరీ చేసిన ఆదేశాలపై ఫేస్ బుక్ కోర్టుకెక్కనుంది. జర్మన్ రెగ్యులేటరీ ఆదేశాలను వ్యతిరేకిస్తూ, దీనిపై అప్పీల్ కు వెళ్లనున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది.

దీంతో ప్రైవసీ రెగ్యులేటర్లకు, ఫేస్ బుక్ కు మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఫేస్ బుక్.. జర్మన్ వాట్సాప్ యూజర్ల డేటాను సేకరించడం వెంటనే ఆపేయాలని, ఇప్పటికే సేకరించిన సమాచారాన్ని తొలగించాలని జర్మన్ ప్రైవసీ రెగ్యులేటరీ ఆదేశాలు జారీచేసింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల డేటాను ఫేస్ బుక్ షేర్ చేసుకుంటోంది. ఈ విషయంపై వాట్సాప్ కొత్త పాలసీ విధానాలను కూడా ప్రవేశపెట్టింది. ఒకవేళ తమ డేటా ఫేస్ బుక్ కు షేర్ చేయడం ఇష్టలేనివారు, వాట్సాప్ వాడకాన్ని నిలిపి వేసుకోవచ్చంటూ అవకాశం కూడా కల్పించింది. డేటా సంరక్షణ చట్టాన్ని ఫేస్ బుక్ అతిక్రమిస్తుందని డేటా ప్రొటెక్షన్, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హాంబర్గ్ కమిషనర్ మండిపడ్డారు. 35 మిలియన్ వాట్సాప్ యూజర్లున్న జర్మనీలో, ఫేస్ బుక్ దీనికోసం సరియైన అనుమతులు పొందలేదని అయన అంటున్నారు. చిలికి చిలికి గాలివానగా మారుతుందో, సర్దుమణుగుతుందో చూద్దాం..

English summary

Whatsapp company angry on Facebook