శుభవార్త .... ఇక వాట్సాప్ ఫ్రీ...

WhatsApp Free Service

01:00 PM ON 20th January, 2016 By Mirchi Vilas

WhatsApp Free Service

ప్రజాకర్షక పధకాలు అమలు చేయడంలో ప్రభుత్వాలే కాదు ఇప్పుడు సాంకేతిక సంస్థలు కూడా వంటబట్టించు కుంటున్నాయి. ఎందుకంటే, ఫ్రీగా వస్తుంటే అందుకోడానికి ఎవరైనా ముందుంటారు కదా. అందునా, నిత్య జీవితంలో ఇప్పుడు ఓ భాగం అయిపోయిన వాట్సాప్, ఫోన్ లో ఫ్రీగా వస్తుందంటే ఎగిరి గంతేయని వాళ్ళున్నారా? అసలు ఈవార్త వింటే చాలు, ఎవరైనా హ్యాపీగా ఫీలవుతారు. ఆండ్రాయిడ్, విండోస్, ఐఓఎస్... ఇలా మీరు ఏ ప్లాట్‌ఫాంలో వాట్సప్‌ ను వాడుతున్నా ఇకపై యానువల్ ఛార్జ్ 68రూపాయలు చెల్లించాల్సిన పనిలేదు. ఈ యాప్ సేవలను యూజర్లు ఉచితంగానే ఉపయోగించుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు ఉచిత సబ్‌ స్క్రిప్షన్‌ ను పొందిన తరువాత సేవలను కొనసాగించాలంటే రుసుము చెల్లించాలని ఇప్పటి వరకు వాట్సప్ యూజర్లకు మెసేజ్ దర్శనమిచ్చేది. కానీ ఇప్పుడు ఆ మెసేజ్ త్వరలో కనుమరుగు అవుతుందట. కొద్ది రోజుల్లోనే ఉచితంగా వాట్సప్‌ ను పొందవచ్చని ఆ కంపెనీ ప్రతినిధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకునే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వాట్సప్ ప్రతినిధులు చెబుతున్నా, అందుకు వేరే కారణం ఉందని టెక్ పండితులు విశ్లేషణ. నేటి స్మార్ట్ ప్రపంచంలో ఇతర ఇన్‌ స్టాంట్ మెసేజింగ్ యాప్‌ ల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవాలంటే యూజర్లకు ఉచిత సేవలు అందించాల్సిందేనని, ఈ నేపథ్యంలోనే వాట్సప్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అంటున్నారు. మొత్తానికి వాట్సాప్ ప్రియులకు ఇది శుభవార్తే మరి.

English summary

A good news for whats app users. The good news was that Whats App is going to be free for life. Up to now whats app charged one dollar amount after one year.