ఇక మీ ఆటలు సాగవు ... మీరు ఎక్కడ వున్నారో చెప్పేస్తుంది

Whatsapp Latest version to find where your friends

06:22 PM ON 30th January, 2017 By Mirchi Vilas

Whatsapp Latest version to find where your friends

సోషల్ మీడియా రంగంలో అగ్రగామిగా దూసుకుపోతూ , ఎప్పటికప్పుడు వినూత్న మార్పులను అందిపుచ్చుకుంటున్న ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ అందిస్తోంది. ఇది వింటేనే అదిరిపడతాం. అవును, ఇప్పటికే వీడియో కాలింగ్ , జిఫ్ షేరింగ్ వంటి సదుపాయాలతో వినియోగదారులకు బాగా చేరువైన వాట్సాప్ యూజర్ల కోసం మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అదేమిటంటే, గ్రూప్ చాట్ లో లైవ్ లొకేషన్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఐవోఎస్ , ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ కు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం నెట్ లో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈలెక్కన చూస్తే,వాట్సాప్ గ్రూపులో లైవ్ లొకేషన్ సదుపాయం ద్వారా మీరెక్కడున్నారో మీ స్నేహితులు తెలుసుకునే వీలుంటుంది. ఇందుకోసం ‘షో మై ఫ్రెండ్స్ ’ అనే ఆప్షన్ ను చేర్చనున్నారు. దీని ద్వారా గ్రూపులోని మిగిలిన వ్యక్తులు ఎక్కడెక్కడున్నారో కూడా తెలుస్తుంది. దీంతోపాటు ఇతరులకు అది ఎంత సమయం కనిపించాలో కూడా నిర్దేశించుకునే వీలు కల్పిస్తున్నారు. స్నేహితులంతా ఒక చోటుకు చేరాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఒక స్థలానికి కొందరు చేరుకుని మరికొందరు దారి తెలీక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆ స్నేహితుడు ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ఈ సదుపాయం పనికొస్తుంది. మరికొద్దిరోజుల్లో ఆండ్రాయిడ్ , ఐవోఎస్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఊరించే ఈ ఫీచర్ కోసం యూజర్లు ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చూడండి: ఇక రాబోయేవి బొద్దింక పాలు?

ఇది కూడా చూడండి: అది మెడా ... బొంగరమా(వీడియో)

English summary

whatsapp releases latest version of Live Location feature in group chat to find where your friends.