వాట్సప్ లవర్స్ కోసం కొత్త అప్ డేట్ వచ్చేసింది

WhatsApp New Feature

11:10 AM ON 26th August, 2016 By Mirchi Vilas

WhatsApp New Feature

సోషల్ మీడియాలో ఎన్నో మార్పులు చేర్పులు, కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు దూసుకుపోతున్న వైనం చూస్తున్నాం. అందులో భాగంగా వాట్సప్ లో ఇప్పుడు కదిలే జిఫ్ బొమ్మలను పంపుకునే వెసులుబాటు వచ్చేసింది. వాట్సప్ లవర్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ కొత్త అప్ డేట్ వచ్చింది. బ్రహ్మానందం వంటి వారితో ఇంటర్నెట్ లో ఫోరమ్ లో షేర్ చేయడం చూసే ఉంటాం.. వీడియో కాకుండా కదిలే బొమ్మలనే జిఫ్ ఇమేజస్ అంటారు. సాధారణంగా కదిలే చిత్రాలంటే వీడియో తోనే సాధ్యం. వాటిని సెండ్ చేయాలంటే చాలా డాటా అవసరం అదే జిఫ్ ఫైల్ పంపాలంటే ఇమేజ్ పంపే డాటాతో ఆరు సెకన్ల వీడియో చిత్రంగా మార్చి పంపొచ్చు. దాని కోసం గ్రూపు లేదా ఒక వ్యక్తి వాట్సప్ త్రెడ్ ఓపెన్ చేసి అటాచ్ మెంట్ క్లిక్ చేయాలి అక్కడ ఉండే కెమెరా ఆప్షన్ తో వీడియో రికార్డు చేయాలి.

ఆరు సెకన్లకంటే తక్కువగా రికార్డు చేయాలి. ఒక వేళ ఎక్కువ సేపు చేసిన ట్రిమ్ చేసేటప్పుడు ఆరు సెకన్లు ఉండేలా చేసి కుడివైపు టాప్ లో ఉండే వీడియో సింబల్ ని క్లిక్ చేస్తే జిఫ్ అని చూపుతుంది . అంతే మన వీడియో సెండ్ చేస్తే ఆటోమేటిక్ గ్గా అది కదిలే బొమ్మలా మారుతుంది. ప్రస్తుతం, అప్పటి కప్పుడు రికార్డు చేసే చిత్రాలనే పంపొచ్చు కానీ, ఆల్ రెడీ సిద్ధం చేసిన జిఫ్ ఫైళ్లు పంపేందుకు అవకాశం ఇవ్వలేదు.

ఈ అప్ డేట్ 2.16.242 బీటా వర్షన్ లో అందు బాటులో తీసుకొచ్చారు. ఈ వర్షన్ కావాలనుకుంటే విడిగా నెట్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి. లేదా గూగుల్ ప్లేస్టోర్ లో బీటా వర్షన్ ని సబ్ స్ర్కైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ సదుపాయం ఐవోఎస్ లో ఇవ్వలేదు కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకే మాత్రమే ఈ సౌకర్యం కల్పించారు.

ఇది కూడా చూడండి: చేతబడి గురించి భయంకర నిజాలు

ఇది కూడా చూడండి: ఈ దేశాలలో మన రూపాయి విలువ చాలా ఎక్కువ

ఇది కూడా చూడండి: ఈ వస్తువులు మీ పర్స్ లో ఉంటే ఇక అంతా బంగారమే!

English summary

Whatsapp new feature for android mobile users. Now WhatsApp users can record videos and convert to zip files then send to another user.