వాట్సాప్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్

WhatsApp Removes Video Calling Feature From Beta Version

04:40 PM ON 20th May, 2016 By Mirchi Vilas

WhatsApp Removes Video Calling Feature From Beta Version

ప్రముఖ ఇన్స్ టెంట్ మెసెజింగ్ సంస్థ వాట్సాప్ తమ కస్టమర్లకు షాకిచ్చింది. వాట్సాప్ లో ఇప్పటి వరకు మెసెజులు పంపించుకోవడం , ఆడియో కాల్స్ , ఫైల్స్ షేరింగ్ వంటి సదుపాయాలను చూశాం . అయితే తాజాగా వాట్సాప్ సంస్థ తమ వినియోగదారులకు మరింత చేరువయ్యే విధంగా వీడియో కాలింగ్ ఫీచర్ ను కుడా తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది . అందుకు తగ్గట్టుగానే బీటా వెర్షన్ యాప్ లో వీడియో కాలింగ్ ఫీచర్ ని గతవారం ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు ఇప్పుడు బీటా వెర్షన్ నుంచి కూడా వీడియో కాలింగ్ ను వాట్సాప్ సంస్థ తోలగించింది. వాట్సాప్ బీటా వెర్షన్ యాప్‌లో కాల్‌ ఐకాన్‌ పై క్లిక్ చేస్తే రెండు ఆప్షన్లు వచ్చేవి. ఒకటి ఆడియో కాలింగ్ మరొకటి వీడియో కాలింగ్‌. కానీ ఇప్పుడు వాట్సాప్ లో వీడియో కాల్‌ ఐకాన్‌ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆడియో కాల్‌ వెళ్తోంది. ఆ ఆప్షన్‌ను ఎందుకు తొలగించారన్న విషయాన్ని మాత్రం వాట్సాప్‌ వెల్లడించలేదు. దీంతో ఎంత ఆశగా ఎదురు చుసిన యూజర్లకు నిరాశే మిగిలింది.

ఇవి కూడా చదవండి:99 రూపాయలకే స్మార్ట్‌ఫోన్‌

ఇవి కూడా చదవండి:గూగుల్ కి 25 వేల కోట్ల ఫైన్?

English summary

Worlds Popular Instant Messaging App Whats App was brought a New video calling feature in its app and released a beta version of Whats App with Video calling feature . But now video calling feature was also removed from its beta version.