త్వరలో వాట్సప్ వీడియో కాలింగ్..

Whatsapp Testing Video Calling Feature

06:18 PM ON 24th December, 2015 By Mirchi Vilas

Whatsapp Testing Video Calling Feature

ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్‌ వాట్సప్.

ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌కు చెందిన ఈ యాప్ గత సెప్టెంబర్ నాటికి 900 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. అయితే ఇతర ప్రధాన ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్స్ అయిన హ్యాంగవుట్స్, స్కైప్ వంటి వాటితో పోలిస్తే దీంట్లో ఒకటే ఫీచర్ తక్కువ. అదే వీడియో కాలింగ్. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి మెసెంజర్ యాప్స్ నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి వాట్సప్‌ కూడా అతి త్వరలో వీడియో కాలింగ్ ఫీచర్‌ను అందించనున్నారు.

దీనికి సంబంధించిన ప్రయోగాత్మక పరిశీలనలు ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై కొనసాగుతున్నాయి. చాటింగ్‌తోపాటు ఒకే సమయంలో వీడియో కాలింగ్ చేసుకునేలా ఈ నయా ఫీచర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ అప్‌డేట్ మరికొద్ది రోజుల్లోనే యూజర్లకు అందుబాటులోకి రానుంది.

English summary

Watsapp testing video calling feature to compete with competitors likes skype and hangouts.