భారత్ లో వాట్సప్ బ్యాన్ !?

WhatsApp to Ban In India

12:55 PM ON 13th April, 2016 By Mirchi Vilas

WhatsApp to Ban In India

అవునా, అంటే అవుననే సంకేతాలు వ్నిపిస్తున్నాయి. ఎందుకబ్బా ఇంతటి నిర్ణయం అంటే, మరి ఓసారి వివరాల్లోకి వెళ్ళాల్సిందే. ఇప్పుడున సాంకేతిక పరిజ్ఞానం సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలంటే, స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరు ఏం వాడినా వాడకున్నా.. వాట్సప్ వాడకం ఇప్పుడో పెద్ద అలవాటుగా మారింది. వాట్సప్ ను వినియోగించే భారతీయుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. వాట్సప్ ను పలు విధాలుగా వినియోగించే తీరు పెరుగుతూ.. వాట్సప్ కానీ భవిష్యత్తులో ఒక్కసారి ఆగిపోతే పరిస్థితి ఏందన్న వరకూ వెళ్లింది. అయితే.. వాట్సప్ అనుసరిస్తున్న తాజా విధానం పుణ్యమా అని.. ఈ సోషల్ నెట్ వర్క్ మీద ఇప్పుడు కేంద్రం బ్యాన్ వేసే ప్రమాదం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.

ఇవి కూడా చూడండి:షాకింగ్: ఐష్ ని ముద్దాడిన జర్నలిస్ట్

దీనికి నిపుణులు చూపిస్తున్న కారణం కూడా సహేతుకంగా వుందట. ఇటీవల కాలంలో వాట్సప్ ‘‘ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్’’ అంటూ ఒక కొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులో తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో వినియోగదారుల సమాచారానికి పూర్తి భద్రత అని వాట్సప్ పేర్కొంటోంది. ఇదంతా బానే ఉన్నా.. ఈ సాంకేతికత వినియోగానికి ట్రాయ్ అనుమతి ఉండదట.

ఇవి కూడా చూడండి:ప్రపంచంలో అతి కష్టమైన పని ఇదేనట

దేశంలోని ఆన్ లైన్ సర్వీసుల్లో 40 బిట్ ఎన్క్రిప్షన్ ను మాత్రమే వినియోగించాలని.. తాజాగా వాట్సప్ వినియోగించిన సాంకేతికత 256 బిట్ అని.. ఇది ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని వాదిస్తున్నారు. వినియోగదారుల డేటాకు పూర్తి భద్రత కల్పించటమే కాదు.. ఈ ఎన్ క్రిప్షన్ కు సంబంధించిన కీ సైతం వాట్సప్ దగ్గర లేదని.. దీని కారణంగా ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య సమాచార పంపిణీ జరిగితే వారిద్దరి మధ్యనే తప్ప.. వేరెవరూ చూసే అవకాశం లేదని చెబుతున్నారు. ఇది ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా చెబుతున్నారు. ట్రాయ్ కానీ ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకుంటే.. వాట్సప్ పై వేటు పడినా ఆశ్చర్యపోవాల్సింది లేదని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. వాట్సప్ కానీ మిస్ అయితే..? పరిస్థితి ఎలా వుంటుందో చెప్పడం కష్టమే. ఎందుకంటే అంతలా వాట్సాప్ కి ఎడిక్ట్ అయ్యారు మనవాళ్ళు ...

ఇవి కూడా చూడండి:

యాంకర్ కాళ్ళు పట్టుకున్న వర్మ- చాగంటి మాటలపై ఫైర్

కోహ్లీ సోనాక్షి ని ఏం చేసాడో చూడండి

English summary

Indian Government was planning to ban popular instant messaging app WhatsApp in India because in a recent update WhatsApp providing more security which it cannot be encrypted by Whats App Also..