ఓల్డ్ ప్లాట్ ఫామ్ లకు వాట్సాప్‌ గుడ్ బై

WhatsApp to stop services for Old OS Phones

04:35 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

WhatsApp to stop services for Old OS Phones

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ అనుబంధ సంస్థకు చెందిన మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ త్వరలో తన సేవలను నోకియా, ఆండ్రాయిడ్‌, బ్లాక్‌బెర్రి పాత ప్లాట్‌ఫామ్‌లకు తన సేవలను నిలిపివేయనుంది. వాట్సాప్‌ తన సేవలను ప్రారంభించి ఏడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2009లో వాట్సాప్‌ సేవలు ప్రారంభమైనప్పుడు బ్లాక్‌బెర్రీ, నోకియా డివైజ్‌ల వినియోగం 70 శాతం ఉండేది. ఆండ్రాయిడ్, ఆపిల్‌, మైక్రోసాఫ్ట్‌ ఓఎస్‌తో పనిచేసే డివైజ్‌లు 25 శాతానికి తక్కువగా ఉండేవి. అయితే వీటి వినియోగం ఇప్పుడు 99.5 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో తమ వినియోగదారులను అప్‌డేటెడ్‌గా ఉంచుతూ మరింత సెక్యూరిటీ అందించాలని వాట్సాప్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా 2016 చివరి నాటికి బ్లాక్‌బెర్రి, బ్లాక్‌బెర్రి 10, నోకియా ఎస్‌40, నోకియా సింబియన్‌ ఎస్‌60, పాత ఆండ్రాయిడ్‌ వర్షన్‌లు అయిన ఆండ్రాయిడ్‌ 2.1, ఆండ్రాయిడ్‌ 2.2, విండోస్‌ ఫోన్‌ 7.1లకు తమ సేవలను రద్దు చేయనున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. పాత ఓఎస్‌లు ఉన్న వినియోగదారులు కొత్త ఓఎస్‌లకు అప్‌గ్రేడ్‌ కావాలని సూచించింది.

English summary

Worlds Top Instant Messaging app WhatsApp to stop services for BlackBerry, Symbian and Windows Phone 7.1 Operating system mobile phones.WhatsApp taken this decision to make WhatsApp more secure and reliable.