వాట్సప్ లో మీకు తెలీని కొన్ని ట్రిక్స్ ఇవే

WhatsApp Tricks You Need To Try

12:34 PM ON 4th January, 2017 By Mirchi Vilas

 WhatsApp Tricks You Need To Try

సోషల్ మీడియా రంగంలో ఎన్నో వున్నా వాట్సప్ రూటే వేరు. మొబైల్ నుంచి క్షణాల్లో ప్రపంచానికి ఏదైనా వార్తగాని, విషయం గానీ అందించే వాట్సాప్ ని ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 100 కోట్ల మంది పైనే వాడుతున్నారు. మన దేశంలోనైతే వాట్సప్‌ను వాడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ. ఇతర అన్ని ఇన్స్టంట్ మెసెంజర్ యాప్స్‌తో పోలిస్తే వాట్సప్‌ను వాడేవారు ఎక్కువనే చెప్పవచ్చు. ఎన్ని కొత్త ఫీచర్లను కల్పించినా, ఇతర యాప్‌లు ఏవీ వాట్సప్‌కు పోటీ కి రాలేకపోయాయి. వాట్సప్ వరల్డ్ వైడ్‌గా ఎంత పాపులర్ అయిందో. అయితే చాలా మందికి తెలియని పలు ఉపయోగకరమైన ట్రిక్స్ వాట్సప్‌లో ఉన్నాయి. వాటి గురించి ఓసారి తెలుసుకోండి.

1/7 Pages

1. వాట్సప్‌లో ఏదైనా టెక్ట్స్ మెసేజ్‌లను టైప్ చేసినప్పుడు ఆ మెసేజ్ బోల్డ్‌గా కనిపించాలంటే సింపుల్‌గా సదరు పదాలకు ముందు, వెనుక ఒక స్టార్ మార్క్‌ను యాడ్ చేయండి. అదెలాగంటే ఉదాహరణకు Rama is a good boy అని వాక్యం ఉందనుకుందాం. అందులో good అనే పదాన్ని bold గా చూపించాలంటే దానికి ముందు, వెనుక *good* అని యాడ్ చేస్తే చాలు. అప్పుడు good అనే పదం బోల్డ్ అవుతుంది. అదేవిధంగా ఇటాలిక్స్ రాయాలంటే అండర్స్కోర్ _ ఉంచాలి. అదే పదాన్ని స్ట్రైక్ త్రూ చేసినట్టుగా రావాలంటే ~ మార్క్‌ను యాడ్ చేస్తే చాలు.

English summary

Unknown Tricks Of Whatsapp. Like How to Create Conversation Shortcuts, what is the meaning of blue ticks..