వాట్సాప్‌ ఇక కొత్త ఎమోజీలు

WhatsApp Update With New Emojis

10:43 AM ON 12th February, 2016 By Mirchi Vilas

WhatsApp  Update With New Emojis

ఎమోజీలు.. మన భావాలను సులువుగా చెప్పడానికి ఉపయోగపడే సింబల్స్. ఇప్పుడు ఏ మెసేజింగ్ యాప్ తీసుకున్నా వీటిదే హవా. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్.. అనుబంధ మొబైల్‌ మెసెజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ లోనూ ప్రస్తుతం ఈ ఎమోజీలదే జోరు. ప్రస్తుతం వాట్సాప్ కొత్త వెర్షన్‌లో మరెన్నో భావాలను చూపే ఎమోజీలను ప్రవేశపెడుతోంది. అయితే వాట్సాప్‌ కొత్త వెర్షన్‌కు కొన్ని చోట్ల మాత్రమే ఇవి అప్‌డేట్‌ అవుతున్నాయి. త్వరలోనే భారత్‌లోనూ అప్‌డేటెడ్‌ వెర్షన్‌ అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌ కొత్త వెర్షన్‌లో స్పైడర్‌, యూనికార్న్‌, పాప్‌కార్న్‌ బాక్స్‌, షాంపేన్‌ బాటిల్‌, రేసింగ్‌ కార్లు, మెడల్స్‌, వాలీబాల్‌ ఇలా కొత్త ఎమోజీలు రానున్నాయి. అలాగే వివిధ రకాల భావాలను చూపే ఫేషియల్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఎమోజీలు కూడా కొత్తగా చేరనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఐదు ఎమోజీ ట్యాబ్‌లతో పాటు మరో మూడు కొత్తగా చేరతాయి.

English summary

Worlds Top Instant Messaging App WhatsApp users on Android have finally started receiving an update that adds much-awaited new emojis to the app