వాట్సాప్ లో గ్రూప్ పోస్ట్ లకు అడ్మిన్ లు బాధ్యులు కారని తీర్పిచ్చిన కోర్టు

Whatsup admistraters are not responsible for every posts

11:19 AM ON 22nd December, 2016 By Mirchi Vilas

Whatsup admistraters are not responsible for every posts

సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లకు ఆ మాధ్యమాల అడ్మినిస్ట్రేటర్లను బాధ్యులను చేసేందుకు దేశవ్యాప్తంగా సంవత్సరం నుంచి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో వాట్సాప్ లో ఇతరులు పోస్ట్ చేసే కంటెంట్ కు వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లు బాధ్యులు కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. అభ్యంతరకరమైన పోస్టులు ఆన్ లైన్ లో ప్రచురితం కావడంతో గతంలో కొందరు అడ్మినిస్ట్రేటర్లను అరెస్టు చేయడం కలకలం రేపింది.

అశిష్ భల్లా వర్సెస్ సురేశ్ చౌదరి కేసులో వాట్సాప్ గ్రూప్ లో సభ్యులు పెట్టిన స్టేట్ మెంట్లు పరువు నష్టం కలిగిస్తున్నాయని అశిష్ భల్లా ఆరోపించారు. దీనికి వాట్సాప్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ ను బాధ్యుడిగా చేయాలని, తనకు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రాజీవ్ సహాయ్ ఎండ్లా పరువు నష్టం దావాను తోసిపుచ్చారు. అడ్మినిస్ట్రేటర్ అనుమతి లేకుండా సభ్యులు ఈ గ్రూప్ లో పోస్టులు చేయరాదనే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

ఇటువంటి కంటెంట్ కు అడ్మినిస్ట్రేటర్ ను బాధ్యుడిగా చేయడమంటే పరువు నష్టం కలిగించే స్టేట్ మెంట్ ప్రచురితమైన న్యూస్ ప్రింట్ తయారీదారును పరువు నష్టానికి బాధ్యుడిని చేయడంతో సమానమని తెలిపింది. ఆన్ లైన్ ప్లాట్ ఫారంను ఏర్పాటు చేసినపుడు, దానిలోని సభ్యులు పరువు నష్టం కలిగించే స్టేట్ మెంట్లను పోస్ట్ చేస్తారని ఆ ప్లాట్ ఫారాన్ని ఏర్పాటు చేసినవారు ఊహించరని పేర్కొంది. అందువల్ల అడ్మినిస్ట్రేటర్లను బాద్యులుగా చేయలేమని పేర్కొంది. సభ్యులు పోస్ట్ చేసే ప్రతి స్టేట్ మెంట్ కు అడ్మినిస్ట్రేటర్ అనుమతి ఉండాలని, అటువంటి అనుమతి లేనపుడు పోస్ట్ చేయడానికి వీలు ఉండదనే పరిస్థితులు లేవని గత నెల 29న ఇచ్చిన తాత్కాలిక ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాకుండా, వివాదంలో ఉన్న పోస్ట్ పరువు నష్టం కలిగించేది కాదని, వాదిని (ప్లెయింటిఫ్ ను) అభినందిస్తున్నట్లుగా ఉందని పేర్కొంది.

ఇది కూడా చూడండి: పేరులోని మొదటి అక్షరం తో మీరెలాంటివారో తెలుసుకోవచ్చిలా

ఇది కూడా చూడండి: న్యూమరాలజీ ప్రకారం మీ పేరు ఏం చెబుతోంది?

ఇది కూడా చూడండి: తాగుబోతుల అలవాటు పోగొట్టేందుకు అద్భుత ఐడియా

English summary

Whats up administrators are not responsible for every content.This was declared by High court authority Delhi