ఆ సమయాల్లో తులసి ఆకులు తెంపితే ఏమౌతుందో తెలుసా

When Can We Pluck Tulsi Leaves

11:12 AM ON 6th January, 2017 By Mirchi Vilas

When Can We Pluck Tulsi Leaves

భారతీయుల జీవన విధానంలో అనాదిగా తులసి మొక్క భాగమైపోయింది. హిందువులు తులసి మొక్కను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పూజల కోసమే కాకుండా, ఆరోగ్యం పరంగానూ తులసి ఆకులను వివిధ ఔషదాల్లో ఉపయోగిస్తారు. వీటిలోని ఔషద గుణాలు అనేక రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడతాయి. చాలా మంది ఇళ్లలో తులసి మొక్కకు కోటను నిర్మించి నిత్యం పూజలు చేస్తుంటారు. అలాంటి తులసి మొక్క ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తెంపకూడదని మీకు తెలుసా? తులసి ఆకులను ఎప్పుడంటే అప్పుడు తెంపడం పాపం చేయడంతో సమానం. ఇంతకూ తులసి ఆకులను ఏయే సందర్భాల్లో తెంపకూడదంటే...

తులసి ఆకులను ఏకాదశి రోజు, రాత్రి సమయంలో, ఆదివారాలు తెంపకూడదు. అలాగే గ్రహణ సమయాల్లో ఈ ఆకులను తెంపడం అరిష్టం.

తులసి మొక్క వద్ద దీపం ఉంచి రోజూ పూజలు చేయాలి, ఆకుల్ని తెంపే సమయంలో ముందుగా తులసిని అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే తెంపాలి.

తులసి ఆకులను నోట్లో వేసుకుని నమలకూడదు. ఎందుకంటే వాటి ఆకుల్లోని యాసిడ్ దంతాలకు హాని చేస్తుంది. కాబట్టి నీళ్లలో లేదా టీలో తులసి ఆకులను కలిపి తీసుకోవాలి.

ఆరోగ్య లేదా మతపరమైన అవసరాలకే తులసి ఆకులను తెంపాలి. అకారణంగా వాటిని తుంచడం పాపం.

ఎండిపోయిన తులసి ఆకులు రాలితే.. వాటిని ఊడ్చివేయకూడదు. వాటిని ఆ మొక్క సమీపంలోనే గుంత తీసి పూడ్చాలి.

తులసి మొక్క ఎండిపోతే దాన్ని పడేయకూడదు. దాన్ని పుణ్య నదీ జలాల్లో లేదా చెరువులోగానీ వేయాలి. ఎండిపోయిన తులసి చెట్టు ఇంట్లో ఉండటం మంచిది కాదు.

ఇవి కూడా చదవండి: 2017 లో మీ రాశిని బట్టి…. మీకు మంచి చేసే కలర్ ఇదే

ఇవి కూడా చదవండి: మహిమ గల ఆంజనేయుడు .. అందుకే కసాపురం వెళ్లాల్సిందే

ఇవి కూడా చదవండి: 2017 లో మన జాతకం ఇలా ఉంటుందట​

English summary

In India we(Hindu's) worship Tulasi Plant as goddess and we used to pray Tulasi also. There was so many benefits of Tulasi and Tulasi leaves were also been using in medicines also. Here are the days and time when we should not pick the leaves of Tulasi Plant.