వీటిని ఎప్పుడు ఎలా మార్చాలో తెలుసా..?

When to replace your pillows and toothbrush

02:33 PM ON 4th February, 2017 By Mirchi Vilas

When to replace your pillows and toothbrush

నిత్యం ఇంట్లో వాడే రకరకాల వస్తువులు ఉంటాయి. కొన్ని తరచూ శుభ్రం చేసుకోవాలి. మరికొన్ని అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. ఇక నిద్రించేటప్పుడు తల కింద పెట్టుకునే దిండ్లు, ఉదయాన్నే దంతాలు తోముకునేందుకు వాడే టూత్ బ్రష్ల విషయం తీసుకుంటే, ఎన్ని రోజులకు ఒకసారి వీటిని మార్చాలనే విషయం .పలువురు ప్రముఖ వైద్యులు కొన్ని విషయాలు చెబుతున్నారు. అయితే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తల దిండ్ల విషయం తీసుకుంటే, ఫోమ్, స్ప్రింగ్, దూది… ఇలా అనేక రకాలుగా తయారు చేస్తారు. అయితే ఫోమ్ దిండు కాకుండా ఇతర దిండ్లను గనక వాడుతుంటే ఒకసారి దాన్ని మధ్యలోకి మడిచి వదలాలి. అలా వదలగానే యాక్షన్తో మళ్లీ వెనక్కి వస్తే అప్పుడు ఆ దిండు బాగానే ఉన్నట్టు లెక్క. అలా అని చెప్పి అదే దిండును కొన్ని సంవత్సరాల పాటు వాడుతామంటే కుదరదు. దిండు బాగా ఉన్నప్పటికీ దాన్ని గరిష్టంగా 3 ఏళ్లకు మించి వాడకూడదు. అలాగే దిండు కవర్లను వారంలో కనీసం రెండు సార్లు ఉతకాలి. అప్పుడే అవి పరిశుభ్రంగా ఉంటాయి. లేదంటే మన తల కింద నుంచి వచ్చే చెమట, జుట్టులోని మృత కణాలు, ఇతర సెల్స్ అన్నీ అందులోకి వెళ్లి అవి మనకు అనారోగ్యాలను కలిగిస్తాయి.

మరి టూత్ బ్రష్ల విషయం తీసుకుంటే,వాటిని 3 నెలలకు ఒకసారి మార్చాల్సి ఉంటుందని డెంటిస్టులు సూచిస్తున్నారు. కానీ మనలో అధిక శాతం మంది నెలల తరబడి… ఇంకా చెప్పాలంటే కొందరు సంవత్సరాల తరబడి టూత్ బ్రష్లను అలాగే వాడుతుంటారు. అలా వాడకూడదు. ఎందుకంటే టూత్ బ్రష్ అనేది మన నోట్లో ఉన్న క్రిములను చంపదు. నోట్లో పేరుకుపోయే పాచి వంటి వ్యర్థాలను తొలగించి నోరు శుభ్రంగా ఉండేందుకే పనికొస్తుంది. టూత్ పేస్ట్ వల్లే మన నోట్లో ఉన్న క్రిములు చనిపోతాయి. కనుక టూత్ బ్రష్లను ఎప్పటికప్పుడు మార్చాల్సిందే. లేదంటే వాటిల్లో క్రిములు పేరుకుపోయి, మరిన్ని చిక్కులు తీసుకొస్తాయి. అందుకే ముందుగానే మేల్కొనాలి.

ఇది కూడా చూడండి: ఈ 6 వస్తువుల్లో ఏదో ఒకటి గిప్ట్స్ ఇస్తే .. మీకు చాలా లాభం వస్తుంది

ఇది కూడా చూడండి: మెదడులోకి దూరిన బొద్దింక ... మరి ఏమైంది ?

English summary

we should definitely know the using period of your pillow covers and toothbrush.