పూజావేళల్లో ఏ ఏ పువ్వులు వాడాలో తెలుసా?

Which type of flowers were used for Pooja

03:33 PM ON 22nd July, 2016 By Mirchi Vilas

Which type of flowers were used for Pooja

భక్తితో సమర్పించే ఫలమైననూ, పుష్పమైననూ, నీరు అయినా సరే స్వీకరిస్తానని భగవద్గీతలో సాక్షాత్తూ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అందుకే ఏ దేవునికైనా సరే.. పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి ఆచారంగా మారిపోయింది. అయితే, ఈ పుష్పాలు కచ్చితంగా ఎందుకు వినియోగించాలి? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి..? అనే విషయాలు చాలామందికి తెలిసి వుండదు. భక్తి పూర్వకంగా, పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే పుష్పాన్ని గాని, పండును గాని, కొంచెం జలాన్ని గాని సమర్పిస్తారో అలాంటివారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా విందారగిస్తానని శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు.

ఎవరైతే దైవాన్ని పరిశుద్ధమైన, నిష్కపటమైన మనస్సుతో పూజించి తరిస్తారో అలాంటి వారిని ఆ దైవం వెన్నంటే ఉండి కాపాడుతుంది. సాక్షాత్తు శ్రీక్రిష్ణభగవానుడే తన అర్చనా విధానంలో పుష్పాలను చేర్చాడంటే.. భగవదారాధనలో పుష్పాల పాత్ర ఎంత అమోఘమైందో అర్థం చేసుకోవచ్చు. అందువల్ల పూజా విధానంలో పుష్పాలు తప్పనిసరయ్యాయి. అయితే.. దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా శుచి, శుభ్రతతో కూడుకున్నదై వుండాలి.

1/8 Pages

బహిష్టులైన స్త్రీలు పుష్పాలను తాకరాదు:

పురిటివారు, మైలవారు బహిష్టులైన స్త్రీలు పుష్పాలను తాకరాదు. అలాంటివి పూజకు పనికిరావు. అలాగే భూమిపై పడ్డ పుష్పాలు, వాసన చూసిన పుష్పాలు, కడిగిన పుష్పాలను పూజకు వినియోగించరాదని శాస్త్రం చెబుతోంది.

English summary

Which type of flowers were used for Pooja