గాంధీకి మహాత్మ బిరుదు ఎవరిచ్చారు.. 

Who gave Mahatma Title To Gandhi

11:04 AM ON 16th February, 2016 By Mirchi Vilas

Who gave Mahatma Title To Gandhi

మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ.. మహాత్మ.. జాతి పిత అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాం. కానీ అసలు గాంధీకి మహాత్మ బిరుదును ఎవరిచ్చారు. ఈ బిరుదును విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. అయితే ఇది నిజం కాదంటోంది గుజరాత్‌ ప్రభుత్వం. సౌరాష్ట్రకు చెందిన గుర్తుతెలియని విలేఖరి ఆ బిరుదును గాంధీకి ఇచ్చారని చెబుతోంది. ఈ అంశం ఇప్పుడు గుజరాత్‌ హైకోర్టును చేరింది. రాజ్‌కోట్‌ జిల్లా పంచాయతీ శిక్షణ్‌ సమితి.. రెవెన్యూ శాఖలో ఒక పోస్టుకు పరీక్ష నిర్వహించింది. ‘మహాత్మ బిరుదును గాంధీకి మొదట ఇచ్చింది ఎవరు?’ అనే ప్రశ్నను ఇందులో ఇచ్చారు. పరీక్ష అనంతరం విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’లో ఈ ప్రశ్నకు ‘ఠాగూర్‌’ను సరైన సమాధానంగా అధికారులు పేర్కొన్నారు. తుది ‘కీ’లో దాన్ని ‘గుర్తుతెలియని విలేఖరి’గా మార్చారు. ఈ పరీక్షలో తప్పు సమాధానాలకు నెగిటివ్‌ మార్కులు ఉండటం వల్ల సంధ్యా అనే అభ్యర్థిని దీనిపై గుజరాత్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే సౌరాష్ట్ర జిల్లాలోని జెత్‌పూర్‌ పట్టణానికి చెందిన ఒక విలేఖరి గాంధీకి మహాత్మ బిరుదును ఇచ్చినట్లు జాతిపిత కార్యదర్శి మహదేవ్‌ దేశాయ్‌ కుమారుడు నారాయణ్‌ దేశాయ్‌ రాసిన ఆత్మకథను రాజ్‌కోట్‌ జిల్లా పంచాయతీ శిక్షణ్‌ సమితి కోర్టులో ఉదహరించింది. ప్రశ్నపత్రాన్ని అధికారులు తయారుచేయలేదని, ఒక వెలుపలి సంస్థ రూపొందించిందని సమితి తరఫు న్యాయవాది చెప్పారు. దేశాయ్‌ పుస్తకం ఆధారంగా ప్రశ్నను వారు తయారు చేశారని వివరించారు. 1916లో గాంధీ దక్షిణాఫ్రికాలో ఉండగా.. సదరు విలేఖరి ఆయనను మొదటిసారిగా మహాత్మ అని సంబోధించారని నారాయణ్‌దాస్‌ పేర్కొన్నట్లు తెలిపారు. ఆ తర్వాతే ఠాగూర్‌ అలా వ్యవహరించారని చెప్పారు. ఇలాంటి పరీక్షలను జాగ్రత్తగా నిర్వహించాలని కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.

English summary

tudents across India are taught that Nobel laureate Rabindranath Tagore gave Gandhiji the title of 'Mahatma'. But the Gujarat government insists that it was actually an anonymous journalist from Jetpur town of Saurashtra who gave the title.