మహేష్‌కి దీపికా అంటే ఇష్టమట!!

Who is Mahesh Babu Favorite Actress??

12:56 PM ON 1st December, 2015 By Mirchi Vilas

Who is Mahesh Babu Favorite Actress??

ప్రిన్స్‌ మహేష్‌ టాలీవుడ్‌లోనే అందగాడు అని చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించనవసరం లేదు. ఎంతో మంది అమ్మాయిలు మహేష్‌ అంటే పడి చస్తారు. అమ్మాయిలే కాదు హీరోయిన్లు కూడా మహేష్‌కి పెద్ద ఫ్యాన్స్‌ ఉన్నారు. మహేష్‌ హాలీవుడ్‌ హీరోలా ఉంటారు అని ఎంతో మంది స్టార్‌ హీరోలు ఖితాబులు కూడా ఇచ్చారు. అయితే మహేష్‌ అంటే అమ్మాయిలకి ఇష్టమే సరే కానీ మహేష్‌కి ఏ అమ్మాయి అంటే ఇష్టం? ఇన్ని సంవత్సరాలలో ఆ విషయం గురించి ప్రిన్స్‌ని ఎవరూ ఈ ప్రశ్న అడగలేదు. నమ్రతా శిరోద్కర్‌ కాకుండా ఇంకెవరు ఇష్టమని మహేష్‌ ని అడిగితే మహేష్‌ తన మనసులో మాటని బయట పెట్టాడు.

నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం (అతిధి సినిమాలో కూడా హీరోయిన్‌తో చెప్తాడు) ఇప్పుడు హీరోయిన్లలో అయితే దీపికా పదుకొనే బాగా ఇష్టం. ముఖ్యంగా పికూ మూవిలో తన నటన చాలా బాగుంటుంది. దీపికా మంచి నటి అంతకుమించి అందంగా కూడా ఉంటుంది అని తన మనసులో మాట బయట పెట్టాడు.

English summary

Who is Mahesh Babu Favorite Actress?? Mahesh Babu told that his favorite actress is Bollywood beauty Deepika Padukone.