పవన్ కళ్యాణా..? ఆయనెవరు..?

Who is Pawan Kalayn asks AAP leader

12:24 PM ON 4th August, 2016 By Mirchi Vilas

Who is Pawan Kalayn asks AAP leader

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఎవరో తెలుగువాళ్లే కాదు మిగిలిన భాషల్లో వారికి కూడా తెలుసు. సినిమాల పరంగా, పొలిటికల్ పరంగా పవన్ చాలామందికి తెల్సిన వ్యక్తి. కానీ పవన్ ఎవరని ఎవరైనా ప్రశ్నిస్తే, ఫాన్స్ కి ఒళ్ళు మండిపోతుంది. సరిగ్గా అదే జరిగింది. పవన్ ఎవరని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడొకరు ప్రశ్నించారు. అంతేకాదు.. పవన్ నేతృత్వంలోని జనసేన పార్టీ గురించి తనకు తెలియదని కూడా అన్నారు. దక్షిణాదిలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్-వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునే యోచనలో ఉండగా ఈ నాయకుడు చేసిన వ్యాఖలు సంచలనం రేపాయి. ఆప్ దక్షిణాది వ్యవహారాల ఇన్-ఛార్జ్ సోమనాథ్ ఇలా తన కామెంట్ తో అందర్నీ ఆశ్చర్యపరిచారు.

రానున్న ఎన్నికల్లో జనసేనతో మీ పార్టీ పొత్తు పెట్టుకుంటుందా అని ప్రశ్నించగా పవన్ కళ్యాణ్ అంటే ఎవరని, జనసేన అంటే... అంటూ సోమనాథ్ ఎదురు ప్రశ్న వేయడంతో మీడియా వాళ్ళు కంగు తిన్నారు. సౌత్ లో ఓ ప్రముఖ నటుడు, కేంద్రంలో అధికార బిజెపికి సన్నిహితుడని భావిస్తున్న వ్యక్తి, జనసేన పార్టీని స్థాపించి జనంలోకి వెళ్ళదలుచుకుంటున్న పవన్ గురించి ఈ ఆప్ నేత ఇలా వ్యాఖ్యానించడం విడ్డూరమని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. అయితే కావాలనే ఇలా మాట్లాడారా అని కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ఇప్పటికైనా పవన్ తన సినీ ప్రాజెక్టులను కాస్త పక్కన బెట్టి, కాస్త రాజకీయాలవైపు కూడా దృష్టి పెడతాడని అతని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. లేకపోతే పవన్ ఎవరనే మాట ఇంకా చాలామంది అనే పరిస్థితి వచ్చేస్తుంది.

English summary

Who is Pawan Kalayn asks AAP leader