జక్కన అని పెట్టింది ఎవరు

Who Names Rajamouli As Jakkanna

01:35 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Who Names Rajamouli As Jakkanna

టాలీవుడ్ తో పాటు తన బాహుబలి సినిమాతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి . రాజమౌళి ని ముద్దుగా జక్కన్న అని తెలుగు ప్రజలు పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. రాజమౌళి కు "జక్కన్న" అన్న పేరు ఎవరో పెట్టారో అన్న విషయం మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం. ఇంతకి దర్శక ధీరుడు రాజమౌళి కి ఆ పేరు పెట్టింది మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అవును ఇండస్ట్రీ లో రాజమౌళి , ఎన్టీఆర్ మంచి మిత్రులన్న విషయం అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ , రాజమౌళి లు ఇద్దారు ఒకే సినిమాతో తెలుగు చిత్ర సీమకు పరిచయమయ్యారు . వీరీద్దరి కాంబినేషన్లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 , సింహాద్రి సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర రికార్డులు తిరగ రాశాయి. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది. అంతే కాదు రాజమౌళి కి ఎన్టీఆర్ చేసిన సీన్లు ఒక పట్టాన నచ్చేవి కాదట , ఇంకా బెటర్ గా నటించమంటూ టేకుల మీద టేకులు తీసి ఎన్టీఆర్ తో బెస్ట్ అవుట్ పుట్ రాబట్టేవాడట , ఇలా తన సినిమాలోని ప్రతి సీన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకునే రాజమౌళి తీరును చూసి "జక్కన్న" అనే సరదాగా పిలిచేవాడట ఎన్టీఆర్. ఇలా ఎన్టీఆర్ సరదాగా పెట్టిన పేరు మెల్ల మెల్లగా రాజమౌళి కు కొసరు పేరుగా మారిపోయింది. ఇది అండి రాజమౌళి "జక్కన్న" పేరు వెనుక ఉన్నఅసలు కథ.

ఏడుస్తూ మీడియా ముందుకు అమీర్

పాట పాడుతూ టాప్ విప్పేసింది

టిఫిన్ బాగుందని, సర్వర్ కి కోరిక తీర్చేసింది

మాల్యా ఇల్లు కొనడానికి భయపడుతున్న బిల్డర్లు

English summary

S.S.Rajamouli has become wolrd wide famous with the Movie Bahubali and he was also called as Jakkanna. That name was named by Junior NTR .We all well know that NTR and Rajamouli were good friends in Telugu Film industry.