దావుద్ ని ఆశ్రయించిన సూపర్ స్టార్ ఎవరబ్బా?

Who Support To Dawood Ibrahim In Bollywood Industry

12:27 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Who Support To Dawood Ibrahim In Bollywood Industry

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో లింకు పెట్టుకున్న అంశంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. వాస్తవానికి దావూద్ కి, బాలీవుడ్ బంధం ఈనాటిది కాదు. చాలా సినిమాలకు ఫైనాన్స్ కూడా చేశాడు. ఈ విషయం బహిరంగ రహస్యమే. అయితే తాజాగా తెల్సిన విషయం ఏమంటే, బాలీవుడ్ సూపర్ స్టార్ ఒకరు నల్లధనాన్ని పనామా, కెనడాలో దాచాలని అనుకున్నారు. ఆ తర్వాత దానిని తెల్లడబ్బుగా మార్చి తిరిగి ఇండియాకు రప్పించాలని భావించారు. అందుకోసం దావూద్ ను ఆశ్రయించారు. ఆ సూపర్ స్టార్ నల్లడబ్బును హవాలా మార్గం ద్వారా ఇబ్రహీం గ్యాంగ్ విదేశాలకు తరలించింది. ఈ ఘటన నాలుగేళ్ల కిందట అంటే 2012లో జరిగింది. దావూడ్ బృందంలోని సభ్యుల ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా కేంద్ర నిఘా బృందం ఈ వివరాలను రాబట్టింది.

ఇది కూడా చూడండి: దిమ్మతిరిగే పచ్చి నిజాలు

ఫోన్ సంభాషణలను బట్టి చూస్తే పాక్ లో ఉన్న దావూద్ షార్జాలోని ఒక గుర్తు తెలియని వ్యక్తితో ఫోన్ లో మాట్లాడారు. వీరిద్దరు 45 తరలించాలని మాట్లాడుకున్నారు. అందులో 40 పనామా, కెనడాకు చేర్చాలని, మిగిలిన 5 కమిషన్ గా తీసుకోవాలని మాట్లాడుకున్నారు. అంతేకాదు ఆ డబ్బును మళ్లీ భారత్ కు రప్పించే బాధ్యత దావూద్ తీసుకున్నాడు. అయితే 45 అంటే 45 కోట్లా? లేకపోతే 45వేల కోట్లా అనేది ఇంకా తేలాల్సి ఉంది. బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన స్టార్ డబ్బునే దావూద్ తరలించారని టాక్.

ఇది కూడా చూడండి: ఇలాంటి అమ్మాయిలతో పెళ్ళికి ఏ అబ్బాయి ఒప్పుకోడట

1990లో అమితాబ్ , షారుక్ , గోవింద్ , సంజయ్ దత్, అమీర్ ఖాన్, సన్నీడియోల్ వంటి సార్లు బాలీవుడ్ ను ఏలుతున్న పీరియడ్. పనామా పేపర్స్ నల్లధనం జాబితాలో అమితాబ్ పేరు ఇప్పటికే వచ్చింది. అయితే దావూద్ ఏ సూపర్ స్టార్ నల్లధనాన్ని విదేశాలకు తరలించాడన్నది తేలాల్సి ఉంది. అయితే నిఘా వర్గాలు ఆ బాలీవుడ్ స్టార్ ను ఇప్పటికే గుర్తించాయని, నల్లధనాన్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో పాత కాల్ డేటాను ప్రభుత్వం విశ్లేషిస్తోందని అంటున్నారు.

ఇది కూడా చూడండి: ఇలాంటి విషయాలు భార్యకి చెప్పకూడదని తెలుసా?

English summary

Who Support To Mumbai mafia don Dawood Ibrahim In Bollywood Industry,