ప్రపంచ మంతటా దీపావళి

Whole World Celebrates Diwali

05:37 PM ON 12th November, 2015 By Mirchi Vilas

Whole World Celebrates Diwali

దీపావళి పండుగను భారత దేశంలోనే కాక ప్రపంచ దేశాల్లో ఉంటున్న భారతీయులు సందడిగా దీపావళి జరుపుకున్నారు. మన దేశంలో బాణాసంచా కాల్పులతో వెలుగు జిలుగల నడుమ ఆత్మీయంగా దీపావళి పండుగ నడిచింది. ముఖ్యంగా మార్వాడీలు లక్ష్మీదేవి పూజ చేసి దీపావళిని ఆనందంగా చేసుకున్నారు. జైపూర్‌లో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. అక్కడి భవనాలను రకరకాల ఆకారాల్లో ఉండే దీపాలతో అలంక రించి , వాటిల్లో అందంగా ఉన్న వాటికి బహుమతులు కూడా అందించారట. ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గోవాలో నరకాసురుడి దిష్టిబొమ్మలను ఎక్కువ ఎత్తుతో తయారు చేయడం ప్రత్యేకత. ఇక విదేశాల విషయానికి వస్తే , నేపాల్ లో ఐదు రోజుల పాటు సందడి నెలకొంటుంది. దీపావళి రోజు కానుకలు ఇచ్చిపుచ్చుకుని, టపాసుల మోత మోగిస్తారు. వీరు లక్ష్మీ దేవికి, వినాయకుడికి పూజలు చేస్తారు. కాగా ఇంగ్లాండ్‌లోని లీసెస్టర్‌లో దీపావళి రోజు నలభై వేలకు పైగా భారతీయులు ఒక్కచోటే చేరి , చిన్నా పెద్ద అంతా కలిసి నానా హంగామా చేస్తారు. అందరూ బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసుకుంటారు.

మలేషియాలో ‘హరిదివాళీ’గా జరుపుతారు. థాయ్‌లాండ్‌లో దీపావళిని ‘ల్యామ్‌ క్రియోంగ్‌’ పేరిట జరుపుకుంటారు. అరిటాకుల్లో దీపాలు పెట్టి నదుల్లో వదులుతారు. మారిషస్ లో ఎక్కువమంది భారతీయులే ఉండడంతో అక్కడకూడా దీపావళి వేడుకలు జరిగాయి . తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతంలో దీపాలు వెలిగించి , సందడి చేసారు. దీపావళికి జపాన్ లో వీధుల్లోని చెట్లన్నీ లాంతరు వెలుగుల్లో జిగేల్‌మంటాయి.

English summary

Whole World Celebrates Diwali