బైక్ ను ఉదయాన్నే సెల్ఫ్ తో కాకుండా కిక్ తో స్టార్ట్ చేయాలి, కారణం ఇదే

Why Bike Should Not Start With Self Start In The Morning

10:44 AM ON 12th January, 2017 By Mirchi Vilas

Why Bike Should Not Start With Self Start In The Morning

ఈరోజుల్లో బ్యాటరీ బైక్ లు ఎక్కువగానే వస్తున్నాయి. వాడకం కూడా ఎక్కువగానే వుంది. అయితే సాధారణంగా ఉదయాన్నే బైక్, స్కూటీ, స్కూటర్ లను స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంది సెల్ఫ్ తోనే స్టార్ట్ చేస్తారు. ఇది అంత మంచిది కాదని, ఇలా చేయడం వల్ల బ్యాటరీ మన్నిక తగ్గిపోవడమే కాక, ఇంజిన్ పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంటున్నారు. . అందుకే మొదట బండిని స్టార్ట్ చేసేటప్పుడు కిక్ తోనే స్టార్ట్ చేయడం మంచిందని. ఎందుకంటే,. రాత్రంత చల్లని వాతావరణంలో ఉండడం వల్ల బండి ఇంజిన్ తో పాటు బ్యాటరీ కూడా చాలా కూల్ మోడ్ లోకి వెళ్లిపోతుందని అంటున్నారు.

కూల్ గా ఉన్న ఇంజన్ ను ఆన్ చేయడానికి చాలా ఎక్కువ మొత్తంలో విద్యుత్ అవసరం పడుతుందని, ఈ క్రమంలో సెల్ఫ్ స్టార్ట్ చేయడం వల్ల, బ్యాటరీ మీద అధిక భారం పడుతుందని విశ్లేషిస్తున్నారు. దీంతో బ్యాటరీ మన్నిక తగ్గిపోతుంది, అంతేకాక…ఒక్కోసారి స్పార్క్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అదే పనిగా సెల్ఫ్ స్టార్ట్ చేసుకుంటూ పోతే…ఇంజన్ మీద కూడా దీని ఎఫెక్ట్ పడి దాని పనితీరు కూడా మందగిస్తుందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిన చాలా బండ్లలో..ఈ సమస్యను అధిగమించే టెక్నాలజి ఉన్నప్పటికీ….ఉదయాన్నే సెల్ఫ్ స్టార్ట్ కంటే కిక్ తో బండి స్టార్ట్ చేయడం ఉత్తమం. ఒకవేళ సెల్ఫ్ స్టార్ట్ చేయాలనుకుంటే..చౌక్ ను ఉపయోగిస్తూ…ఒకేసారి కాకుండా రెండు మూడు సార్ల ప్రయత్నంలో బండిని స్టార్ట్ చేయడం ఉత్తమం అని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: ప్రియురాలి భర్తకు విషపు ఇంజక్షన్ ... ఎందుకో తెలిస్తే షాకవుతారు

ఇవి కూడా చదవండి: ఖైదీ నెంబర్ 150 రివ్యూ అండ్ రేటింగ్

English summary

Recent Days All Bikes Were Coming With Self Start Technology and mostly all of us use Self Start in the morning but it was not the right thing to start our bike with self start we should start up iour bike with kick start only.