అమ్మాయిలు/అబ్బాయిలు ప్రేమించిన వారిని ఎందుకు మోసం చేస్తారో తెలుసా?

Why boys or girls cheated their lovers

11:33 AM ON 14th October, 2016 By Mirchi Vilas

Why boys or girls cheated their lovers

ప్రేమలో పడని వాళ్లుండరు. అందులోని మధురం ఆస్వాదించేవాళ్లతో పాటు, ప్రేయసికి కూడా అవలక్షణాలున్నా ఆమెలోని మంచి విషయాలపైనే దృష్టి పెడతారు. అందుకే, ఆమెకు నచ్చని పనులు చేస్తూ, ఆమెకు తెలియకుండా ఉంచుతూ మోసపుచ్చుతూ వుంటారు కూడా. అయితే ఎలాంటి పనులకు ఎందుకు పాల్పడతారో అందుకు తగ్గ సమాధానాలను ఇప్పుడు బయోలాజికల్ ఆంధ్రపాలజిస్ట్ హెలెన్ ఫిషర్ పరిశోధన కుండబద్దలు కొట్టి తేల్చేసింది.

హెలెన్ ఫిషర్ మాట్లాడుతూ మామూలుగా చెప్పాలంటే ఎవరికైనా తాను ప్రేమిస్తున్న వ్యక్తి ఈ లోకానికే కేంద్ర బిందువుగా మారతారని, కేవలం శృంగారపరంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఆ వ్యక్తికి చేరువగా ఉండాలని తహతహలాడతారని, ప్రేమలో ఉన్నవాళ్ళలో ఒకరికొకరు ఎదుటివారిలో తమకు నచ్చని విషయాలతో పెద్ద జాబితా రాయగలరని, అయితే వాటన్నిటినీ పక్కనపడేసి, కేవలం ఎదుటివారిలో ఉన్న మంచి విషయాలపైనే దృష్టి సారిస్తారని విశ్లేషించారు.

1/5 Pages

తాను ప్రేమిస్తున్న వ్యక్తి అంత రొమాంటిక్ గా లేకపోయినా జీవశాస్త్రపరంగా ఏం జరుగుతుంది? అదేవిధంగా ప్రేమిస్తున్న వ్యక్తిని ఎందుకు మోసం చేయడానికి సిద్ధమవుతారు? మన మెదడులోని ప్రోత్సాహక హార్మోన్ డోపమైన్ రెచ్చిపోయిన స్థితి రొమాంటిక్ లవ్ అవుతుందా? వంటి విషయాలకు సంబంధించి కూడా పరిశోధించారు. ఇందుకోసం ఘాటైన ప్రేమలో ఉన్న వ్యక్తికి సాధారణమైన ఫోటోను, తాను ప్రేమిస్తున్న వ్యక్తి ఫోటోను చూపించినపుడు మెదడులో ఏం జరుగుతుందో పరీక్షించారు.

English summary

Why boys or girls cheated their lovers