పెళ్లికూతురు కొబ్బరి బొండం పట్టుకురావడం వెనుక అసలు రహస్యం ఇదే!

Why bride brings coconut in marriage

11:37 AM ON 11th August, 2016 By Mirchi Vilas

Why bride brings coconut in marriage

కన్యా దానం చేయడం ఉత్తమమైన ఫలం ఇస్తుందని అంటారు. కన్యాదానం అంటే ఆషామాషీ వ్యవహారం కానేకాదు. సాలంకృత కన్యాదానం చెయ్యాలని శాస్త్రం చెబుతోందని అంటారు. సాలంకృత కన్యాదానం అంటే అమ్మాయి చెవులకు, చేతులకు, మెడకు, నడుముకు, బంగారు ఆభరణాలు పెట్టి కన్యాదానం చెయ్యాలి. అలాగే కన్యాదాత కన్యాదానానికి ముందు దశదానాలు చేసి కన్యాదానం చెయ్యలి. అలా చేసినట్లు అయితేనే కన్యాదాన ఫలితం పూర్తిగా కన్యాదాతకు దక్కుతుందని శాస్త్రం చెబుతోంది. మరి కాలమాన పరిస్థితులలో వివాహము అంటేనే కన్యాదాతకు చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఇక బంగారం ధర చూస్తేనేమో కొండెక్కి కూర్చుంది. మరి మధ్య తరగతి కుటుంబీకులకు బంగారం కొనడము కష్టమే.

ఇలాంటి పరిస్థితులలో దశదానాలు కూడా మరీ కష్టం. మన శాస్త్రం, ఒక వేళ నీకు బంగారం కొనడం ఇబ్బంది అయినా కొని తీరవలసినదే అని చెప్పదు. దానికి తరుణోపాయం చెబుతుంది. తరించడానికి కన్యాదానం చేసేటప్పుడు కన్యాదాత వధువు చేతిలో కొబ్బరిబోండం, మంచి గంధపు చెక్క, మంచి గుమ్మడి కాయ పెట్టి దానం చేస్తే సాలంకృత కన్యాదానం చేసినట్లే. అందుకే కొబ్బరిబోండంను పూర్ణఫలం అంటాం. అంతే కాకుండా అది పార్వతీపరమేశ్వర స్వరూపంగా భావించి వధువు కొబ్బరిబోండం పట్టుకుని వస్తుంది. అందుచేత ఆ కొబ్బరిబోండానికి ఎట్టి పరిస్థితులలోను పిన్నులను గుచ్చడం కానీ, లేకపోతే పిచ్చి పిచ్చి అలంకారాలు చెయ్యడం వంటివి అస్సలు చెయ్యకూడదట. పూర్తి కన్యాదాన ఫలితం ఈ రకంగా శాస్త్రోక్తంగా చేస్తే దక్కుతుంది. లేనిపోని కొత్త పోకడలకు పోకూడదని కూడా శాస్త్రం మనల్ని హెచ్చరిస్తుంది. సర్వేజనా సుఖినో భవంతు అనడం ద్వారా అందరు సుఖంగా వుండాలని కాంక్షించే మన సంప్రదాయం ఎంతో ఉన్నతమైంది.

English summary

Why bride brings coconut in marriage