కాలిక్యులేటర్‌లో నంబర్లు ఎందుకు తేడాగా ఉంటాయో తెలుసా?

Why calculator and smart phone keypad numbers in opposite direction

11:01 AM ON 7th July, 2016 By Mirchi Vilas

Why calculator and smart phone keypad numbers in opposite direction

ఒకప్పుడు ఎంత పెద్ద కూడిక తీసివేత అయినా మాన్యువల్ గా ఉండేది. అంతటి నాలెడ్జ్ పిల్లలకు, పెద్దలకు ఉండేది. రాను రాను సాంకేతిక పరిజ్ఞానం కారణంగా చిన్న చిన్న కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు చేయాలంటే ఎవరైనా సరే కాలిక్యులేటర్లు వాడేవారు. అయితే ఇప్పుడు ఏం వాడుతున్నారో వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే, వాటి గురించి అందరికీ తెల్సిందే.. అదేనండీ స్మార్ట్ ఫోన్లు. అవును, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి కదా. దీంతో లెక్కల పరంగా ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే స్మార్ట్ ఫోన్ ను తీయడం, కాలిక్యులేటర్ ఓపెన్ చేయడం, లెక్కలు చేయడం వంటి పనులు ఫాస్ట్ గా చేస్తున్నారు. అయితే అలా అని చెప్పి సాధారణ కాలిక్యులేటర్లను మరీ పూర్తిగా వాడడం లేదని కాదు. వాటిని వాడే వారు వాటినీ వాడుతున్నారు.

కాకపోతే ఎక్కువ మంది మాత్రం స్మార్ట్ ఫోన్లే వాడుతున్నారు. అయితే ఇప్పుడు మ్యాటర్ మాత్రం వేటిని ఎక్కువ వాడుతున్నారని కాదు. ఫోన్ కీ ప్యాడ్, కాలిక్యులేటర్ నంబర్ ప్యాడ్ ల గురించి. అవును, వాటి గురించే. ఎందుకంటే, వాటి ప్రత్యేకత అదీ మరి. వివరాల్లోకి వెళదాం.. ఫోన్ కీ ప్యాడ్ (స్మార్ట్ ఫోన్ లో అయితే వర్చువల్ కీ ప్యాడ్ ఉంటుంది), కాలిక్యులేటర్ నంబర్ ప్యాడ్ లను గమనిస్తాం. కానీ వాటి డిజైన్ గురించి అంతగా పట్టించుకుని ఉండరు. ఎందుకంటే, ఫోన్ కీ ప్యాడ్ అయితే నంబర్లు 1,2,3 అని టాప్ లో ఉంటాయి. అదే కాలిక్యులేటర్ అయితే దాని ప్యాడ్ లో నంబర్లు 7,8,9 అని టాప్ లో ఉంటాయి.

అయితే అవి అలా అపోజిట్ డైరెక్షన్ లో ఎందుకు డిజైన్ చేయబడ్డాయంటే, తెలుసుకుని తీరాల్సిందే. కాలిక్యులేటర్లంటే ఇప్పటి మాట కాదు. ఎప్పుడో జమానా కాలం నుంచి వాటిని వాడుతున్నారు. అయితే అవి రాక ముందు కాలంలో క్యాష్ రిజిస్టర్లు అని పిలవబడే యంత్రాలు ఉండేవి. వాటిని గణనకోసం ఉపయోగించే వారు. కాగా ఆ యంత్రాల్లో పై భాగంలో 9 సంఖ్య ఉంటే కిందకి వచ్చే సరికి 0 ఉంటుంది. ఈ క్రమంలో ఆ డిజైన్ కు అనుగుణంగానే తదనంతరం కాలిక్యులేటర్లను తయారు చేశారు. అయితే 1960లలో బెల్ ల్యాబ్స్ వారు హ్యూమన్ ఫ్యాక్టర్ ఇంజినీరింగ్ స్టడీస్ ఆఫ్ ది డిజైన్ అండ్ యూజ్ ఆఫ్ పుష్ బటన్ టెలిఫోన్ సెట్స్ అనే అంశంపై పరిశోధనలు చేశారు.

ప్రయోగాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో వారు నంబర్ ప్యాడ్ లలో పై భాగంలో 1,2,3 సంఖ్యలు ఉండే డిజైన్ నే ప్రజలు అధికంగా గుర్తు పెట్టుకుంటారని, దాన్నే సులభంగా వాడవచ్చని గుర్తించారు. దీంతో అప్పటి నుంచి ల్యాండ్ ఫోన్లే కాదు, వాటి తరువాత వచ్చిన సెల్ ఫోన్లు, ఇప్పటి స్మార్ట్ ఫోన్లలోనూ కీ ప్యాడ్ లో పై వరుసలో 1,2,3 సంఖ్యలు ఉంటాయి. అదీ ఫోన్ కీ ప్యాడ్ కు, కాలిక్యులేటర్ నంబర్ ప్యాడ్ కు మధ్య ఉన్న అసలైన విషయం. కానీ ఆ తరువాత నుంచైనా కాలిక్యులేటర్ల డిజైన్ లలో మాత్రం మార్పులు తేలేదు. ఒకప్పటి పాత పద్ధతి ఏదైతో ఉందో దాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

అందుకే ఫోన్లకు, కాలిక్యులేటర్లకు నంబర్ ప్యాడ్ లు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటాయి. అదండీ సంగతి.

English summary

Why calculator and smart phone keypad numbers in opposite direction