అక్కడ 4 రెక్కలుంటే , ఇక్కడ 3 రెక్కలే ... ఫ్యాన్ ల తేడా లాజిక్కు ఏమిటో

Why Ceiling fans in the US have 4 or 5 blades

11:54 AM ON 14th July, 2016 By Mirchi Vilas

Why Ceiling fans in the US have 4 or 5 blades

సాధారణంగా ఫ్యాన్ అనగానే మూడు రెక్కలుంటాయని ఇట్టే చెప్పేయచ్చు. అంతేకాదు, 1 నుండి 5 వరకు స్పీడ్ ను అప్ గ్రేడ్ చేసే స్విచ్ ఉంటుందని కూడా మనమైండ్ లో ఫిక్స్ అయి ఉంటాం. కానీ మన ఫ్యాన్ లకు మూడు రెక్కలుంటే, అమెరికాలో మాత్రం నాలుగు రెక్కలుంటాయి. ఇప్పుడిప్పుడు మన దగ్గర కూడా కొన్ని ఫ్యాన్స్ కు నాలుగు రెక్కలున్నప్పటికీ, చాలా వాటికి మూడు రెక్కలే ఉండడం చూస్తున్నాం. అమెరికాలో మాత్రం నాలుగు రెక్కల ఫ్యాన్సే ఉండడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే ...

అమెరికాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, అందుకని నాలుగు రెక్కల ఫ్యాన్ వాడుతారు. ఇలా నాలుగు రెక్కల ఫ్యాన్ కు, చలి తీవ్రతకు సంబధం ఏమిటంటే.. నాలుగు రెక్కల ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆ ఫ్యాన్ నుండి గాలి కూడా తక్కువగా నే వస్తుంది. పైగా ఆ గాలి కూడా వేడిగా ఉంటుంది, కాబట్టి నాలుగు రెక్కల ఫ్యాన్ ను చలితీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వాడతారు.

అదే మనదేశంలో చలితీవ్రత అంతగా ఉండనందున మనం మూడు రెక్కల ఫ్యాన్ ను వాడతాం. మూడు రెక్కల ఫ్యాన్ నుండి గాలి ఎక్కువగా వీచడంతో పాటు చల్లటి గాలి తగిలి హాయిగా ఉంటుంది. అందుకే మనదేశంలో మూడు రెక్కల ఫ్యాన్, అమెరికాలో నాలుగు రెక్కల ఫ్యాన్ వాడుతారు. అదన్న మాట ఇందులోని లాజిక్.

English summary

Ceiling fans in the US have 4 or 5 blades Why? You want to know the reason you read the full article it helps you.