బాలయ్య షూటింగ్ కి చంద్రన్న ఎందుకు రాలేదు

Why Chandrababu Not Attended To Balayya 100 movie Launch event

11:31 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

Why Chandrababu Not Attended To Balayya 100 movie Launch event

బాలయ్య వందో సినిమా ఎంతో ఆర్భాటంగా ప్రారంభోత్సవం పెట్టుకుంటే ఎపి సిఎమ్ చంద్రబాబు ఎందుకు రాలేదు ఇప్పుడు అందరి నోటా ఇదే చర్చ. చిలవలు పలవలుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే, ఓ పక్క పార్టీలో కీలక వ్యక్తి.. స్వయానా వియ్యంకుడు..ఇంకోవైపు పార్టీ ఎమ్మెల్యే.. అలాంటి వ్యక్తి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి సిఎం చంద్రబాబు ఎందుకు అటెండ్ కాలేదన్నది పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న చర్చ.

సిఎం కెసిఆర్ ను ఇన్వైట్ చేసినప్పటికీ కెసిఆర్ వచ్చినా రాకున్నా చంద్రబాబు తప్పకుండా ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతారని భావించినప్పటికీ చంద్రబాబు, బాలకృష్ణ వందవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాలేదు. అయితే కేసిఆర్ రావడం కూడా గ్రేట్ గా చెప్పుకుంటున్నారు. అయితే ఎందుకు చంద్రబాబు ఈ ప్రోగ్రామ్ ని లైట్ తీసుకున్నారనే దాని పై పార్టీ వర్గాలు రకరకాలుగా స్పందిస్తున్నాయి. ఇప్పటికే ఉగాది పర్వదిన వేళ అమరావతిలో ఆ సినిమా ప్రకటన కార్యక్రమానికి చంద్రబాబు విచ్చేశారని, ఇక అదే సినిమా కార్యక్రమం కావడంతో ఇప్పుడు లైట్ తీసుకున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే కేంద్రమంత్రులు గన్నవరం పర్యటనకు వస్తున్న నేపథ్యం కూడా చంద్రబాబు గైర్హాజరీకి కారణమని మరో వర్గం చెబుతోంది. ఏదైతేనేం మొత్తానికి రారనుకున్న కెసిఆర్ రావడం , వస్తారనునుకున్న చంద్రబాబు రాకపోవడం చర్చకు దారితీసింది.

ఇవి కూడా చదవండి:

గోత్రం ఒకటైతే పెళ్లి చేసుకోరా ?

రాజ్యసభకు డాక్టర్ స్వామి - సిద్దు - సురేష్

గోపిగుళ్ళో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న షకలక శంకర్

English summary

Balakrishna 100th movie Gowthami Putra Satakarni Movie Launch event was done in a grand manner. Telangana Chief Minister KCR attended as chief guest but Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu did not attended due to busy meting with central ministers.