ఒలింపిక్స్ లో క్రికెట్ ఎందుకు ఉండదో తెలుసా?

Why Cricket was eliminated from Olympics

02:54 PM ON 11th August, 2016 By Mirchi Vilas

Why Cricket was eliminated from Olympics

ప్రపంచంలో రెండే రెండు మతాలు ఒకటి క్రికెట్, మరొకటి సినిమా. ఇప్పుడు మనం మాట్లాడుకునేది క్రికెట్ గురించి కాబట్టి సినిమా గురించి పక్కన పెట్టేద్దాం. అయితే ప్రపంచవ్యాప్తంగా పక్కన పెడితే.. భారత దేశంలో క్రికెట్ కు ఉన్నంత ఆదరణ వేరే ఏ ఆటకు లేదన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి నుంచి మనమందరం క్రికెట్ ఆడుతూ పెరిగిన వాళ్ళమే కదా. కానీ ప్రపంచం మొత్తం పాల్గొనే ఒలింపిక్స్ లో మాత్రం క్రికెట్ కు స్థానం లేదు. క్రికెట్ ఎందుకు లేదనే ప్రశ్న చాలా సార్లు మనల్ని పీడించి ఉంటుంది. క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ లోనే ఫుట్ బాల్, హ్యాన్డ్ బాల్ లాంటి అన్ని ఆటలు పుట్టాయి. ఇవన్నీ ఒలింపిక్స్ లో ఉండగా క్రికెట్ ను ఎందుకు వెలివేశారు. కానీ దాని వెనుక అసలు కారణం వేరు. మొత్తం రెండు కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ కారణాలు ఏంటో తెలుసుకుందాం..

1/3 Pages

కారణం 1:


క్రికెట్ వచ్చిన కొత్తలో దాన్ని 6 రోజుల పాటు ఆడేవారు. ఇంకా పురాతన కాలానికి వెళితే రెండు టీములు ఆలౌట్ అయ్యే దాకా ఆడుతూనే ఉండేవారు. అందువల్ల క్రికెట్ ఎక్కువ సమయం కాలం తీసుకునే ఆటగా పరిగణింప బడింది. ఒలింపిక్స్ కేవలం 16 రోజులలో ముగిసిపోయే పోటీలు. ఒక్క ఆటకే 6 రోజులు పడితే మొత్తం అందరు పోటీ పడటానికి ఎన్ని రోజులు అవసరం ఉంటుంది. అన్న ప్రశ్న తలెత్తడంతో 1900 సందర్భంగా క్రికెట్ ఉంచాలా వద్దా అనే చర్చ మొదలయింది.

English summary

Why Cricket was eliminated from Olympics