బిచ్చగాళ్ళే కానీ వీళ్ళు చేసే పనులు చూస్తే షాకవుతాం

Why Delhi Cops Are Collecting Fingerprints Of Beggars

11:50 AM ON 10th December, 2016 By Mirchi Vilas

Why Delhi Cops Are Collecting Fingerprints Of Beggars

ఇదేమిటి బిచ్చగాళ్ల మీద పడ్డం అనుకుంటున్నారా? వీళ్ళు పనులు అలాంటివి మరి. చిరిగిన దుస్తులు...చింపిరి జుట్టుతో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద నిలబడి వచ్చి పోయే వాహనచోదకులను దీనంగా యాచిస్తున్న రవి (26), కదం (24) దంపతులను చూస్తే ఎవరికైనా జాలి కలుగుతోంది. అయితే అసలు కిటుకు ఇక్కడే వుంది. దీనంగా యాచించే కళ్ల వెనుక కరడుకట్టిన దోపిడీ దొంగలని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఎన్ క్లేవ్ ప్లైఓవర్ కింద నివాసముంటూ కొందరు పగలు బిచ్చగాళ్లుగా యాచిస్తూ రాత్రి కాగానే ఇళ్లల్లో దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు.

ఓ ఇంటి తలుపులను రవి, కదమ్ ల జంట పగులగొట్టి లక్షరూపాయల నగదు, బంగారం ఆభరణాలను చోరీ చేశారు. ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఫుట్ పాత్ లు, ఫ్లైఓవర్ల కింద నివాసముంటున్న 500 మంది బిక్షగాళ్లను ఢిల్లీలోని 16 పోలీసుస్టేషన్లకు పిలిపించి వారి వేలిముద్రలను తీసుకోవడంతోపాటు వారి పేరు, ఊరు, నివాసముంటున్న ప్రాంతాల వివరాలతో ప్రొఫైల్స్ ను రూపొందించే పనిలో పడ్డారు. గతంలో కొందరు బిక్షగాళ్లు చిన్నచితకా చోరీలు చేశారని, కాని ఇటీవల ఇళ్లలో దొంగతనాలు చేస్తున్న నేపథ్యంలో వారి వేలిముద్రలతో పాటు వారి వివరాలు సేకరిస్తున్నామని ఢిల్లీ డీసీపీ ఈశ్వర్ సింగ్ చెప్పారు. ఢిల్లీ వాసులు బిక్షగాళ్లను అనుమానంతో చూడాలని డీసీపీ కోరారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్ జిల్లాకు చెందిన రవి,కదమ్ దంపతులు ఢిల్లీ వీధుల్లో యాచిస్తూ తిరుగుతూ డబ్బున్న ఇళ్ల యజమానులెవరో చూసి రాత్రి కాగానే వారు చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. బ్రాండెడ్ దుస్తులు, బ్రాండెడ్ ట్రావెలింగ్ బ్యాగుతో మంచి దుస్తులు ధరించి అనుమానాస్పదంగా కనిపించిన యాచక దంపతులను పట్టుకొని ప్రశ్నిస్తే పలు చోరీల గుట్టు రట్టుయిందని పోలీసులు చెప్పారు. దీంతో ఢిల్లీలోని యాచకులందరినీ పోలీసుస్టేషన్లకు పిలిపించి వారి వేలిముద్రలతోపాటు వివరాలు తీసుకొని వదిలివేశారు. దీనివల్ల ఢిల్లీలో ఎక్కడైనా చోరీలు, దోపిడీలు జరిగితే వేలిముద్రల సాయంతో ఎవరు అసలు నిందితులో గుర్తించి సులభంగా పట్టుకోవచ్చని పోలీసులు చెప్పేమాట. ఏ పుట్టలో ఏపాముందో అంటే ఇదే కాబోలు.

ఇది కూడా చూడండి: రామరాజ్యం అని ఎందుకంటారో తెలుసా?

ఇది కూడా చూడండి: నోట్ల రద్దుపై సుప్రీం ప్రశ్నల వర్షం ... కేంద్రం ఉక్కిరిబిక్కిరి

ఇది కూడా చూడండి: ‘ధృవ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

English summary

Why Delhi Cops Are Collecting Fingerprints Of Beggars.