తిరుమలలో భక్తులు పువ్వులు ఎందుకు పెట్టుకోకూడదు?

Why devotees not keep flowers at Tirumala

03:56 PM ON 1st October, 2016 By Mirchi Vilas

Why devotees not keep flowers at Tirumala

తిరుమలలో భక్తులు పూలు పెట్టుకోకూడదంటారు. ఎందుకు పెట్టుకోకూడదో కారాణాలు కూడా ఉన్నాయని పండితులు తెలుపుతారు. తిరుమల శ్రీనివాసునికి సంబంధించినంత వరకూ శ్రీరంగం భోగమండపం. కంచి త్యాగమండపం. అలాగే.. తిరుమల పుష్పమండపం. అనే నానుడి పూర్వ కాలం నుంచే ఉంది. అక్కడ పుట్టే ప్రతిపువ్వూ స్వామికోసమే పూస్తుందని భక్తుల నమ్మకం. ఆ పువ్వులు ఆయన సేవలోనే తరిస్తాయని వారు తెలుపుతారు. అందునా స్వామి పుష్పప్రియుడు. అందుకే అక్కడ పూసే ప్రతిపువ్వునూ వేంకటేశ్వరుడి సేవకే వినియోగించాలి తప్ప మానవమాత్రులు ధరించకూడదన్నది ఈ నియమంలో అంతరార్థం దాగి ఉంది. ఒక వేళ ఎవరైనా అక్కడి పూలు పెట్టుకుంటే అరిష్టమని భక్తుల నమ్మకం..

English summary

Why devotees not keep flowers at Tirumala