దెయ్యాలు తెల్ల చీరే ఎందుకు కట్టుకుంటాయి?

Why did ghosts wear white saree

02:54 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

Why did ghosts wear white saree

పోలీసులకి, లాయర్లకి, డాక్టర్లకి, డ్రైవర్లకి, ఆర్మీ వాళ్లకి యునిఫామ్‌ ఉంటుంది. ఇలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవరి పనికి తగ్గట్టు వారికి ఒక డ్రెస్‌ కోడ్‌ ఉంటుంది. అయితే మరి భయపెట్టడానికి దెయ్యాలకి తెల్ల చీరే యునిఫామా? మరి కానప్పుడు దెయ్యాలకి ఎందుకు వైట్‌ అండ్‌ వైట్‌ యూనిఫామ్‌లో ఉంటాయి? అసలు దెయ్యాలకి తెల్లచీర అనే డ్రెస్ కోడ్‌ పెట్టిందెవరు? మన దేశంలో కొందరికి కాషాయం డ్రెస్, చర్చి ఫాధర్లకి వైట్‌ డ్రెస్‌ ఉండాలని రూల్‌ పెట్టినట్టు దెయ్యాలకి కూడా ఎవరైనా తెల్ల చీర కట్టాలని రూల్‌ పెట్టారా? మనుషుల్లో సాంప్రదాయాలని కాపాడటానికి సంఘాలు ఉన్నట్టు, దెయ్యాల డ్రెస్‌ కోడ్‌ పరిరక్షణ కోసం కమీటీలు ఏమైన ఉన్నాయా? ఏమో ఎవరికి తెలుసు?

అసలు ఫస్ట్‌ నుంచి దెయ్యాలు ఎందుకు తెల్ల చీరలోనే కనిపిస్తాయి. రంగు రంగుల చీరలు ఎందుకు కట్టుకోవు? చిన్నప్పుడు సినిమాల్లో కూడా దెయ్యాలు తెల్ల చీరలనే కట్టుకున్నాయి. మా తాతా, నాన్న చిన్నప్పుడు కూడా దెయ్యాలకి తెల్ల చీరే ఉండేదట. మరిప్పుడు ఎందుకు మీరు తెల్ల చీర దయ్యాలు అని కొత్తగా మొదలు పెట్టారు. అసలు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, మ్యాటర్‌ని ఎక్కడికో తీసుకు వెళ్తున్నారు? సూటిగా చెప్పు సుత్తి లేకుండా. అసలు బేసిగ్గా దెయ్యానికి రంగు, రుచి వాసన ఉండవు అని ఓ స్వామిజి చెప్పారు. ఏంటి స్వామి సాక్ష్యం? అని అడిగితే దండేసి ఉన్న వాళ్ల ఆవిడ ఫోటోని చూపించాడు. మరో ప్రశ్న అడిగేలోపు నాయానా.. ఇదంతా మీ సృజనాత్మకత(creativity) అని మనసులో మాట చెప్పాడు.

అవును నిజమే అసలు ఇదంతా మన సృజనాత్మకతే. అసలు దెయ్యాలంటే తెల్ల చీర, కాళ్లకి గజ్జెలు, మల్లెల వాసన అని మన సినిమా వాళ్లే క్రియేట్‌ చేశారు. దానికి తగ్గ మంచి పాట ఒకటి పెడితే ఇక అది, నిను వీడని నీడను నేనే…. అంటూ దెయ్యాలు నడుచుకుంటూ సారీ.. సారీ.. నడవాల్సిన కర్మ వాటికేంటి, గాల్లో ఎగురుకుంటూ వస్తాయి. ఇదే విషయమై ఒక డాక్టర్‌ గారిని అడిగితే మనిషి మానసిక స్థితిని బట్టి దెయ్యాలు లాంటివి కనపడతాయి, నిజానికి దెయ్యాలు అసలు లేవు అని చెప్పాడు. ఇది నిజమే అయినా స్వామిజి చెప్పిందే వినడానికి బాగుందే అనిపించింది. కాబట్టి సపోర్ట్ అంతా తెల్ల చీరకే.. ఇక దెయ్యాల సినిమాలు చూసిన దగ్గర నుండి మొదలయింది ఈ తెల్ల చీర కాన్సెప్ట్‌.

రామ్‌ గోపాల్‌ వర్మ లాంటి వారి దయ వల్ల దెయ్యాలంటే ఒక స్లో మోషన్‌, భయంకరమైన శబ్ధం, రాత్రి మాత్రమే దెయ్యాలు వస్తాయని ప్రతి ఒక్కరికి పిచ్చ క్లారిటీ వచ్చింది. ఇక అప్పటి నుండి భర్తల్ని నేరుగా కొట్టలేని భార్యలు తెల్ల చీర కట్టుకుని జుట్టు విరభూసుకుని భర్తలతో నాట్యం మొదలు పెట్టారు. ఇక ఊళ్లల్లో మంత్రగాళ్ల సంగతైతే చెప్పనక్కర్లేదు వారే వేషం వేసి ఇరగ దీసేవారు. నా సామీ రంగా వీళ్లందరి పుణ్యామా అని దెయ్యాలకు ఒక బ్రాండ్‌ ఇమేజ్‌ వచ్చేసింది. సరే మన పెద్ద వారు ఎటూ ఒక డ్రెస్‌ కోడ్‌ పెట్టారు కదా అని ప్రతి ఒక్కరు దెయ్యం గురించి చెప్పాలంటే… ఒక్కసారి వీపు చరుచుకుని తెల్లచీర దగ్గర నుండే మొదలెడతారు కథని.. ఇది దెయ్యాల యొక్క తెల్ల చీర కాన్సెప్ట్..

English summary

Why did ghosts wear white saree. Why did women ghosts wear white saree? Do you know the reason for that? Then please read in this link.