అందుకా ఈ అమ్మాయి గోవా చెక్కేసింది?

Why did navy officer daughter went to Goa

11:23 AM ON 20th June, 2016 By Mirchi Vilas

Why did navy officer daughter went to Goa

ఇటీవల హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో మిస్ అయి గోవాలో తేలిన 17 ఏళ్ళ అమ్మాయి కైరవి శర్మకు సంబంధించి కొత్త విషయం వెలుగుచూసింది. ఎయిర్ పోర్టు నుంచి వెళ్లిపోయేముందు ఆమె తన తండ్రికి ఓ టెక్స్ట్ మెసేజ్ పెట్టిందట. తను ఎవరిమీదా ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నానని, అందువల్ల జాబ్ సంపాదించాకే ఇంటికి తిరిగి వస్తానని అందులో పేర్కొందట. విశాఖపట్నంలో ఉంటున్న ఈమె తండ్రి నేవీ ఆఫీసర్. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కైరవి ఆచూకీని గోవాలో కనుక్కుని క్షేమంగా ఆమెను ఆమె తండ్రి వద్దకు చేర్చిన సంగతి తెల్సిందే.

విశాఖ నుంచి పూణే వెళ్తూ మధ్యలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ఈమె.. పూణే వెళ్ళాల్సిన విమానం ఎక్కకుండా విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి ప్రయాణికులను తీసుకువెళ్ళే ఎయిర్ పోర్ట్ బస్సు పుష్పక్ ఎక్కిందట.. అదే రోజున హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లిందో గానీ గోవా వెళ్ళిపోయింది. అందరినీ హడలు గొట్టేసింది. మొత్తానికి పోలీసులు వేగంగా ఈమె ఆచూకీ కనుగొన్నారు.

English summary

Why did navy officer daughter went to Goa