ఎన్టీఆర్ నాగ్‌కి సాక్సులు వెయ్యాలనే 'ఊపిరి' వదిలేసాడా?

Why did Ntr left Oopiri movie

03:46 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Why did Ntr left Oopiri movie

అక్కినేని నాగార్జున-కార్తీ కలిసి నటించిన చిత్రం 'ఊపిరి'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్రెంచ్ లో సూపర్ హిట్ అయిన 'ఇన్టచ్బుల్స్' చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో కార్తీ సరసన తమన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే 'ఊపిరి' చిత్రం చూసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అనుమానం వెంటాడుతోంది. అదేంటంటే ఇంత మంచి సినిమా ని ఎన్టీఆర్ ఎందుకు వాదులుకున్నాడో అని ఎంతో మంది ఆలోచిస్తున్నారు. అయితే యంగ్ టైగర్ అభిమానులు మాత్రం 'ఊపిరి' లో కార్తీ రోల్ ను ఎన్టీఆర్ చేయకపోవడమే మంచిదైందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: వ్యభిచారిగా మారిన టీచర్

ఎందుకంటే సినిమాలో సాక్స్ లు తొడిగే సన్నివేశం ఉండటమే దీనికి కారణం. అవును.. ఊపిరి లో కథ రీత్యా నాగార్జున కాళ్లకు కార్తీ సాక్స్ లు తొడుగుతాడు. ఆ సన్నివేశంలో ఎన్టీఆర్ ఉన్నా అలాగే నటించాలి. ఇలాంటి సన్నివేశాల్ని ఓ నటుడిగా ఎన్టీఆర్ చేసినా తన అభిమానులు ఒప్పుకోరనే ఆలోచన తోనే ఎన్టీఆర్ ఊపిరి ని వదులుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరోవైపు నాగార్జున అభిమానులు మాత్రం ఎన్టీఆర్ పారితోషకం సరిపోకనే ఊపిరి ని వదిలేసాడని ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రచారాలు ఎలా ఉన్నా నాగ్-కార్తీ మాత్రం ఒక అద్భుతమైన చిత్రంలో నటించారు.

ఇది కూడా చదవండి: కొన్నిసార్లు సీన్ డిమాండ్ చేస్తే చూపించక తప్పదు

ఇది సూపర్ హిట్ అని అందరూ ఒప్పుకున్నారు కూడా. నటుడు అంటే అన్ని పాత్రలు చెయ్యాలి అంతే కానీ ఇలా చేస్తే అప్పటిలో ఎన్టీర్-ఏఎన్ఆర్ కలిసి అన్ని సినిమా లు చేసే వారా అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు.

English summary

Why did Ntr left Oopiri movie. Nagarjuna-Karthi latest celluloid Oopiri movie get Block buster hit talk. But Young Tiger Ntr left this movie.