శ్రీజ ఫంక్షన్ కి పవన్ కావాలనే రాలేదా?

Why did Pawan Kalyan not attend Srija marriage function

05:47 PM ON 26th March, 2016 By Mirchi Vilas

Why did Pawan Kalyan not attend Srija marriage function

ఈమధ్యే 'సర్దార్' ఆడియో ఫంక్షన్ లో సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నదమ్ముల అనుబంధం చూపించారు. ఇంతలోనే మరో విషయంలో తేడా వచ్చిందా... ఏమో అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరు కూతురు శ్రీజకు తన చిన్ననాటి స్నేహితుడైన కల్యాణ్ కానుగంటితో పెళ్లి నిశ్చ‌య‌మైన నేపధ్యంలో చిరు ఇంట పెళ్లి ముచ్చట్లు స్టార్ట్ అయ్యాయి. కీలకమైన పెళ్లికూతురుని చేసే ఘట్టం కూడా సందడి చేసింది. రెండు రోజుల క్రితం శ్రీజను పెళ్లి కూతురిని చేసిన వేడుకకు చిరూ కుటుంబసభ్యులతో పాటు, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులందరూ హాజరైనా, ప‌వ‌న్ మాత్రం డుమ్మా కొట్టాడట.

ఇది కూడా చదవండి: సన్నీ మళ్లీ రెచ్చిపోయింది.. ఈసారి మరీ వేడి పుట్టిస్తుంది

అయితే ప‌వ‌న్ త‌న తాజా చిత్రం 'స‌ర్దార్' షూటింగ్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లడమే ఇందుకు కారణమని, కావాలని కాదని తెలుస్తోంది. ఇక చిరూ స్పందిస్తూ పవన్ కల్యాణ్ షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లనే హాజరుకాలేదని, పెళ్లికి తప్పకుండా హాజరవుతాడని వివరణ కూడా ఇచ్చాడట. అయినా రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ రాకపోవడానికి వెనుక ర‌క‌ర‌కాల కార‌ణాలున్నాయని తెలుగు ఇండ‌స్ర్టీ లో అనుకుంటున్నారు. అసలు శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకున్న సమయంలో పవన్ తీవ్రంగా వ్యతిరేకించాడట. శ్రీజను చూడటానికి కూడా ఇష్టపడేవాడు కాడట. కుటుంబ సభ్యులంతా ఈ విషయాన్ని మర్చిపోయినా, పవన్ మాత్రం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఆర్తీ అగర్వాల్ ఇంకా బతికే ఉందా?

ఆ కోపంతోనే ఈ ఫంక్షన్‌కు హాజరుకాలేదని సినీజనం గుసగుసలాడుకుంటున్నారు. చిరు ఇంట్లో పెళ్లి ఉంటే ప‌వ‌న్‌కు ముందే తెలియదా... ఎంత బిజీలో ఉన్నా ఆ రోజు వీలు చూసుకుని వ‌స్తాడ‌ని శ్రీజ అంటే ప‌వ‌న్‌కు ఇష్టం లేకే ఈ కార్య‌క్ర‌మానికి ప‌వ‌న్ హాజరుకాలేదని విశ్లేషిస్తున్నారు. ఎప్పుడో ఏదో జరిగితే అది మనసులో పెట్టుకుని, వ్యవహరించడం పవన్ నైజం కాదని అభిమానులు అంటున్నారు. ఇందులో ఏది నిజమో...

ఇది కూడా చదవండి: భర్త పై కోపంతో వేడి నూనె పోసి నరకం చూపించింది

English summary

Why did Pawan Kalyan not attend Srija marriage function? Pawan Kalyan not attended Chiranjeevi second daughter second marriage function.