గుడికి వెళ్ళేటప్పుడు గంట కొట్టడం వెనుక ఆంతర్యం ఏమిటి?

Why do ring bells in temple and home

10:22 AM ON 30th August, 2016 By Mirchi Vilas

Why do ring bells in temple and home

మన సంప్రదయంలో దేవుని ఎదుట గంట కొట్టడం వుంది. గుడిలోనూ, ఇళ్ల దగ్గర కూడా దేవునికి హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతాం. ఇక పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లోకి, గుళ్ళలోకి వెళ్లినప్పుడు అక్కడ ఉపాలయాలు కూడా ఉంటాయి. అన్నిచోట్ల గంటలు ఉంటాయి. అక్కడ దేవుణ్ణి స్మరిస్తూ, గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గంట కొట్టడం, అలాగే పూజారి గుళ్ళో దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టడం. హారతి తరువాత ఓ గంట కొట్టడం చూస్తుంటాం. మరి గంటలు ఎందుకు కొడతారు? ఆ గంటలు ఎటువంటి ఫలితాన్ని, పరమార్థాన్ని తెలుపుతాయో చూద్దాం.

1/13 Pages

1. గుడిలో గంట ఎందుకు కొడతాం?


గంటను మ్రోగించినపుడు ఓం అనే ప్రణవనాదం వెలువడుతుంది. ఆ గంటానాదం మనోచింతలన్నింటినీ పారద్రోలి, మనసును దైవం వైపు నిమగ్నం చేస్తుంది. గంట అంటే... మండపంలోని గంట దేవుడిని దర్శిస్తున్న వ్యక్తి చెవిలో ఓంకార ధ్వనిని నింపడానికి ఉపయోగించే గంట. అలాంటి గంటను దేవుడికి ఎదురుగా మండపంలో ఉన్న గంటను హారతి ఇచ్చేటప్పుడు మోగించకూడదు. ఎందుకంటే... ఆ ఓంకార నాదానికి సమానమైన అనుకరణ ధ్వనిని లోలోపల వింటూ మాత్రమే దైవాన్ని దర్శించాలి. అనుకరణ ధ్వని అంటే, గంటకొట్టాక కొంతసేపటి వరకూ వచ్చే చిన్నపాటి ఊ అని వినిపించే శబ్ధం లాంటిదన్నమాట.

English summary

Why do ring bells in temple and home