డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన నాలుక ఎందుకు చూస్తారో తెలుసా?

Why doctors check our tongue when you went to hospital

11:33 AM ON 22nd October, 2016 By Mirchi Vilas

Why doctors check our tongue when you went to hospital

మానవ దేహమే ఒక దేవాలయం అంటారు. ఈ దేహంలో ప్రతి అంగానికి ఓ ప్రాధాన్యత వుంది. అందులో ఏది లేకున్నా లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మానవ శరీర అంతర్భాగాల్లో మిగతా వాటితో నాలుక సరిసమానమైనది అంటారు. ఇది కేవలం రుచులు తెలుసుకోవడానికే కాదు అది మన ఆరోగ్యాన్ని తెలిపే ఒక కొలమానం కూడానని అంటున్నారు. నాలుక, రంగు, మృదుత్వం, తేమల ద్వారా శరీరం లోలోపల ఏం జరుగుతోందో బయటపెడుతుంది. ఎడతెగకుండా లాలాజలాన్ని పంపడం ద్వారా నోట్లోని బ్యాక్టీరియానంతా బయటకు పంపుతూ నోటిని శుభ్రం చేస్తుంది. సహజంగా లేత పింక్ కలర్ లో, తేమగా, మృదువుగా ఉండే నాలుక ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపే ఒక సూచన.

డాక్టర్ వద్దకు వెళ్లినప్పుడు నాలుకను పరిశీలించడం ద్వారా డాక్టర్లు ఎనీమియా నుంచి విటమిన్, లవణాల లోపాల దాకా డీ- హైడ్రేషన్ నుంచి కిడ్నీ సమస్యల దాకా నాలుకను చూడటం ద్వారానే తెలుసుకుంటారు. వీటితో పాలు రక్త ప్రసరణ స్థాయి, కొలెస్ట్రాల్ నిలువలు, అలర్జీలు, జీర్ణాశయ సమస్యలు ఇవన్నీ బయటపడతాయి. నాలుక మీద కనిపించే ప్రధాన లక్షణాలు తెలుసుకుందాం..

1/9 Pages

నాలుక పాలిపోయి ఉంటే, రక్తంలో హిమోగ్లోబిన్ లోపాలు, ఇనుము లోపించిన ప్రొటీన్ ఉన్నాయని గ్రహించాలని అంటున్నారు. ఇవి నీరసం నిస్సత్తువల ద్వారా బయటపడుతూ ఉంటాయి సమతులాహారం తీసుకోవడం ద్వారా ఆ లోపాలను అధిగమించవచ్చట.

 

English summary

Why doctors check our tongue when you went to hospital