శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడో తెలుసా?

Why does Siva sits at burial ground

02:52 PM ON 17th October, 2016 By Mirchi Vilas

Why does Siva sits at burial ground

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ కారకులు. ఇందులో లయ కారకుడైన పరమేశ్వరుని శరీరం మీద బూడిద, త్రిపుండ్రం. అంతిమయాత్రలో మనకి తోడెవ్వరూ ఉండరు. తాను మనతో ఉన్నాననే భరోసా ఇవ్వడానికే శివుడు శ్మశానాలలో సంచరిస్తూండడం వల్ల శ్మశాన వాటికలకు కైలాసభూములనిపేరు. శివం అంటే కాల్యాణం, శుభం అని అర్థం. శుభాన్ని కలిగించే వాడు శివుడు. అరిష్టం శివోతి తనూకరోతి అంటే అరిష్టాలను తగ్గించేది శివం అని అర్థం. శివుడు నిర్గుణుడు. లయకారుడు. నిరాడంబరుడు. విలక్షణమైన వ్యక్తిత్వం, వేషధారణ, వేదాంతతత్త్వం ఉన్నవాడు.

1/7 Pages

సహజంగా అందరూ అందంగా కనిపించాలనుకుంటారు, కాని అందుకు భిన్నంగా శివుడు స్వయంగా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, ఎవ్వరూ ధరించలేని, చూడటానికి భీతిని కలిగించే అలంకారాలతో సాక్షాత్కరిస్తాడు. అందువల్లే శివతత్త్వం అనేది స్థిరపడింది. అందరూ పట్టువస్త్రాలు ధరిస్తే శివుడు దిక్కులు అనే వస్త్రాలను ధరించి, దిగంబరుడయ్యాడు. అందరూ బంగారు మేడలలో నివసిస్తుంటే ఆయన శ్మశానంలో నివసిస్తాడు. అంతిమంగా ప్రతి ప్రాణి చేరేది శ్మశానానికేనని తెలియచెప్పడానికే ఆయన శ్మశాన వాసి అయ్యాడు.

English summary

Why does Siva sits at burial ground