ఇండియా లో స్టీరింగ్ కుడివైపు, ఇతర దేశాల్లో ఎడమవైపు ఎందుకుంటుందో తెలుసా?

Why driving steerings reverse in other countries

03:34 PM ON 1st August, 2016 By Mirchi Vilas

Why driving steerings reverse in other countries

మాములుగా మన దేశంలో కార్ మొదలగొను బస్, లారీ, ఇంకా ఇతర పెద్ద వాహనాల్లో స్టీరింగ్ కుడివైపున ఉంటుంది. కానీ కొన్ని దేశాల వాహనాల్లో స్టీరింగ్ కుడివైపున ఉంటాయి. అంతే కాదు కొన్ని దేశాల్లో రోడ్డుపై కుడివైపుకు వాహనాలను నడుపుతారు. అదే మన దేశం అయితే రోడ్డుకు ఎడమ వైపు వాహనాలను నడుపుతారు. అసలు ఈ తేడా ఎందుకు? అన్ని ప్రాంతాల్లో డ్రైవింగ్ ఒకే రకంగా ఎందుకు ఉండదు? అనే ఆలోచనలు మీలో ఎన్నోసార్లు వచ్చే ఉంటాయి. అయితే దానికి కారణం మీకు తెలిసి ఉండదు. అయితే దానికి కారణమేంటో మనం ఇప్పుడు చూద్దాం..

1/6 Pages

ఇది ఇప్పటి మాట కాదు.. 1700వ సంవత్సరం నాటి మాట. అప్పట్లో ప్రస్తుతం ఉన్న వాహనాలేవీ లేవు. కేవలం గుర్రాలను మాత్రమే రవాణాకు ఉపయోగించేవారు. వాటిపై ఎక్కి ప్రయాణించేవారు. అయితే అలా గుర్రాలపై ప్రయాణించడానికి ముందుగా వాటిపైకి జనాలు ఎడమ వైపు నుంచే ఎక్కేవారు. ఎందుకంటే ఎక్కువ శాతం కుడి చేతి వాటం కలవారే ఉండడం చేత. దీంతోపాటు అప్పట్లో కత్తులు ఎక్కువగా వాడే వారు కాబట్టి వాటిని వ్యక్తులు తమ ఎడమ వైపు ఒరలో ఉంచుకునే వారు. ఈ క్రమంలో గుర్రానికి కుడి వైపు నుంచి ఎక్కితే కత్తితో సమస్యలు వస్తాయి కాబట్టి దానికి ఎడమ వైపు నుంచే ఎక్కేవారు. అలా ఎక్కిన తరువాత కూడా రహదారిపై ఎడమ వైపు నుంచే ప్రయాణించడం మొదలు పెట్టారు. అది అప్పటి వారికి సౌకర్యంగా ఉండేది.

English summary

Why driving steerings reverse in other countries