ఉదయం 3 గంటలను 'డెవిల్ అవర్' అని ఎందుకంటారో తెలిస్తే భయపడతారు!

Why early morning 3 O clock will be Devil hour

10:48 AM ON 24th June, 2016 By Mirchi Vilas

Why early morning 3 O clock will be Devil hour

దెయ్యాలు భూతాలు లేవని ఇవన్నీ మూఢ నమ్మకాలని ఎంత వాదించినా నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు. ఇక దెయ్యాలను బేస్ చేసుకుని హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఎన్నెన్నో సినిమాలు.. పైగా కామెడీ జోడించి మరీ హారర్ మూవీస్ తీసేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైనా తెల్లవారుజామున హఠాత్తుగా మెలకువ వచ్చినప్పుడు టైం చూస్తే 3 నుంచి 4 మధ్య ఉందంటే అదో భయం కొందరికి. పైగా దెయ్యాల సినిమాల్లో ఎక్కువగా దెయ్యాల యాక్టివిటీస్ ని రాత్రి 3 గంటల సమయంలోనే చూపిస్తారు? అసలు తెల్లవారుజామున 3 గంటల సమయం దెయ్యాలకు ప్రత్యేకమా? దేవుడిని పూజించడానికి సరైన సమయమా? కొన్ని సందర్భాల్లో ఉదయం 3 గంటల సమయంలో.. ఉన్నట్టుండి భయపడినట్టు అనిపిస్తుంది.

కొన్నిసార్లు బాగా చెమట పట్టేస్తుంటుంది. అలాగే చిన్నప్పుడు ఉదయం 3 గంటలను దెయ్యాల సమయంగా చెప్పేవాళ్లు. లేదా అవర్ ఆఫ్ డెడ్ అని చెప్పేవాళ్లు. 3గంటలను ఎందుకు డెవిల్ అవర్ అని పిలుస్తారు? సాధారణంగా ఉదయం 3 గంటల సమయంలో దెయ్యాలు తమ పని చేసుకుంటూ ఉంటాయని కొందరికి ఒక నమ్మకం ఉంటుంది. ఈ సమయాన్ని అపవిత్రమైన సమయంగా చెబుతారు. ఎందుకంటే.. దెయ్యాలు ఈ సమయంలో యాక్టివ్ గా ఉండి, తమ పనులు చేస్తూ ఉంటాయని ఒక అపోహ బలంగా ఉంది. పైగా ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉంటారు... ఎవరూ ఏమీ చేయలేరని.. దెయ్యాలు తమ పనులు చేసుకుంటూ ఉంటాయని ఉదయం 3 గంటల సమయాన్ని డెవిల్ అవర్ అని పిలుస్తారని అంటారు.

మంత్రగత్తెల సమయంగా కూడా ఉదయం 3గంటలను భావిస్తారు. ఈ సమయంలో దెయ్యాలన్నీ కలిసి.. స్మశానంలో.. తమ కోరికలు తీర్చుకుంటాయని చెబుతారు. అందుకే ఒకవేళ తెల్లవారుజామున 3గంటలకు మెలకువ వస్తే.. మళ్లీ నిద్రపట్టడానికి చాలా సమయం పడుతుందని గుర్తు చేస్తున్నారు. ఇక తెల్లవారుజామున 3గంటల వేళ గురించి సైన్స్ మరోలా చెబుతుంది. ఈ సమయంలో మన శరీరం చాలా రిలాక్స్ గా ఉంటుంది. హార్ట్ బీట్, కార్డియాక్ ప్రెజర్, పల్స్ రేట్ అన్నీ.. ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. అందుకే మనం కాస్త అసౌకర్యంగా ఫీలవుతామని.. సైన్స్ చెబుతోంది.

అందుకే ఆ సమయంలో చెమట ఎక్కువగా పట్టినట్టు ఉంటుంది. దీనివల్ల త్వరగా నిద్రపట్టక ఇబ్బందిపడాల్సి వస్తుందని సైన్స్ వివరిస్తోంది. అయితే చాలా సందర్భాల్లో తెల్లవారుజామున 3గంటలను డెవిల్ అవర్ గా భావించినప్పటికీ.. కొన్ని మత గ్రంథాలు మాత్రం.. దేవుడిని పూజించడానికి ఇదే సరైన సమయమని.. చెబుతున్నాయి. దేవుడిని ఉదయం 3 నుంచి 4 గంటల మధ్యలో పూజించడం వల్ల మంచి జరుగుతుందని చెబుతాయి. ఎందుకంటే ఆ సమయం బ్రహ్మ మూహూర్తంగా చెబుతారు. ఆ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండడం వలన మనస్సు దేవుని పై లగ్నం చేయడానికి వీలుగా ఉంటుందని అంటారు.

English summary

Why early morning 3 O clock will be Devil hour