ముద్దు పెట్టుకునేప్పుడు కళ్ళెందుకు మూసుకుంటారో తెలుసా?

Why eyes are closed when we are kissing

12:07 PM ON 24th March, 2016 By Mirchi Vilas

Why eyes are closed when we are kissing

ముద్దు.. ఒక ఆడ మగ మధ్య ఉన్న ప్రేమని మాటల్లో కాకుండా ముద్దు రూపంలో కూడా చూపిస్తారు. ఈ ముద్దు అనేది ప్రతీ ఒక్కరీలో ఏదో తెలియని ఫీలింగ్ ని కల్గిస్తుంది. అసలు ముద్దు అంటే ఏదో తెలియని అనుభూతిని కలిగిస్తుంది. పైగా ఒక ఆడ, మగ జీవితంలో తొలిముద్దు అనేది జీవితాంతం గుర్తుండిపోయే ఒక తియ్యని అనుభూతి. అయితే మన చిన్నప్పుడు ముద్దంటే బుగ్గ పై పెట్టుకునేది అనుకునే వారు. కానీ అసలు అందరికీ ఇష్టమైన ముద్దు మాత్రం పెదవుల్ని పెదవులతో ముడివేసి ఫ్రెంచ్ ముద్దే ఎక్కువ ఇష్ట పడతారు. అయితే ఈ ముద్దు ని పెట్టుకునే అప్పుడు వాళ్ళకి తెలియకుండానే అందరూ కళ్ళు మూసుకుంటారు. ఈ విషయం వాళ్ళకి కూడా తెలియకుండానే జరిగిపోతుంది.

అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం పై పరిశోధకులు పరిశోధనలు చేసి దీని వెనుక ఉన్న అంతర్యాన్ని కనుగొన్నారు. అదేంటంటే మానవ మెదడు కొన్ని సంధర్భాల్లో ఒకే సమయంలో రెండు పనులని సరి సమానంగా చెయ్యలేదు. ముఖ్యంగా బాగా సున్నితమైన విషయంలో మెదడు అసలు సహకరించలేదు. మానవ శరీరంలో బాగా సున్నితమైనవి పెదవులు. ఆ పెదవులను వేరే పెదవులతో జోడించే సమయంలో మెదడులోని న్యూరాన్లు ఉత్తేజితం అవుతాయట. అలా అధిక సంఖ్యలో న్యూరాన్లు ఉత్తేజితం అయ్యే సమయంలో మెదడు చూపు పై పట్టుని కోల్పోతుంది. దీనితో మనకు తెలియకుండానే ముద్దు పెట్టుకునే అప్పుడు కళ్ళు మూసుకుపోతాయని పరిశోధకులు పరిశీలించి చెప్పారు.

English summary

Why eyes are closed when we are kissing? There is the reason for when we are kissing another.