ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలంటే...

Why girls put mehandi in ashada masam

10:17 AM ON 14th July, 2016 By Mirchi Vilas

Why girls put mehandi in ashada masam

మన పండుగలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అన్నీ ఆరోగ్య రహస్యాలు, పరమార్ధం జోడించి పెట్టినవేనని అంటారు కదా. అందులో భాగంగా గోరింటాకును ఆషాఢం మాసంలో మహిళలు గోరింటాకును ఎందుకు పెట్టుకుంటారు అనే విషయంలోకి వెళ్తే.. దీని వెనుక పలు కారణాలున్నాయని తెలుస్తుంది. ఆషాడం వచ్చిందంటే ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గ్రీష్మంలో మన శరీరం వేడితో కూడుకుని వుంటుంది. ఆషాడంలో బయటి వాతావరణం చల్లబడిపోతుంది.

అలాంటి సమయంలో మన శరీరంలోని వేడి, బయట చల్లబడిన వాతావరణానికి విరుద్ధంగా తయారవుతుది. కాబట్టి అనారోగ్యాలు తప్పవు. అందుకే గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తగ్గించే శక్తి గుణం పుష్కలంగా ఉంది. అంతేకాకుండా గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు తప్పకుండా పెట్టుకోవాలని పెద్దలు చెప్పడమే కాకుండా, డాక్టర్లు కూడా ఆ దిశగా సూచనలు చేస్తున్నారు. ఇక జ్యోతిష్యులు చెప్పినదాని ప్రకారం, ఆధ్యాత్మిక పరంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని.. ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ద్వారా సౌభాగ్యాన్ని పొందిన వారవుతారని అంటున్నారు.

English summary

Why girls put mehandi in ashada masam