చిలక్కొట్టిన జామ పండు ఎందుకు తియ్యగా ఉంటుందో తెలుసా?

Why guava get more sweet after parrot biting

04:59 PM ON 29th June, 2016 By Mirchi Vilas

Why guava get more sweet after parrot biting

మాములుగా మన ఇంటి పెరట్లోనో లేక తోటలోనో జామ చెట్లను చూస్తూ ఉంటాం. ఒక్కోసారి ఆ చెట్ల పైకి వచ్చి రామ చిలుకలు వాలి జామ పండ్లను కొరికి వెళ్లిపోతుండడం మనం చూస్తూ ఉంటాం. అయితే అవి చాలా తియ్యగా వుంటాయని చెప్పి వెంటనే కోసుకుని తినేస్తాం. అయితే చిలక్కొట్టిన జామ పండు తియ్యగా ఉంటుందని తెలుసు కానీ ఎందుకు తియ్యగా ఉంటుందో ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఆ విషయం మనం తెలుసుకుందాం.. ఇందులో ఉన్న చిన్న లాజిక్ ఏంటంటే.. చిలుకలు కొట్టిన పండ్లు తియ్యగా ఉండవు, తియ్యగా ఉన్న పండ్లనే చిలుకలు కొడతాయి.

కాబట్టి చిలకకొట్టిన ప్రతిపండు తియ్యగా ఉంటుంది. సాధారణంగా చిలుకలు ఎక్కువగా పండ్ల చెట్ల మీదుంటాయి. ఇదే సమయంలో పండ్లను ఇచ్చే ప్రతి చెట్టు.. 5 రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. అవి.. 1. ఆక్సిన్లు 2. జిబ్బరెల్లిన్లు 3. సైటోకైనిన్లు 4. ఇథిలిన్ 5. అబ్సిసిక్ ఆమ్లం. ఈ ఐదు హార్మోన్లలో ఇథిలిన్ పండ్లను త్వరగా పక్వానికి వచ్చేలా ప్రేరేపిస్తుంది. ఇథిలిన్ ఓ రకమైన వాసనతో ఉంటుంది. చిలుకలు వాటిని కనిపెట్టి.. ఇథిలిన్ సహాయంతో పక్వానికి రాబోతున్న పండును తినే ప్రయత్నం చేస్తాయి. పరిమాణాన్ని బట్టి చిలుక కొంచెం తినగానే.. దానికి సరిపోతుంది మిగితాది వదిలిపెడుతుంది.

అందుకే చిలకకొట్టిన పండు తియ్యగా ఉంటుంది అనే కంటే తియ్యగా ఉండే పండునే చిలకకొడుతుంది అంటే సరిపోతుంది.

English summary

Why guava get more sweet after parrot biting