జనతా గ్యారేజ్ వాయిదాకు కారణం ఏంటబ్బా!

Why Janatha Garage release date was postponed

10:54 AM ON 16th July, 2016 By Mirchi Vilas

Why Janatha Garage release date was postponed

అనుకున్నామని అన్నీ జరగవు అనుకోలేదని ఆగవు కొన్ని అంటూ ఓ సినీ కవి చెప్పిన సంగతి గుర్తుంది కదా. అంతేకాదు జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అని కూడా ఆ కవి చెప్పారు. ఇప్పడు ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా ఎంచుకున్న 'జనతా గ్యారేజ్' సినిమా షూటింగ్ త్వరగా అవగొట్టి, ఆగస్టు 12న విడుదల చేస్తామంటూ తొలుత న్యూస్ వచ్చింది. అయితే ఆలోగా 'జనతా గ్యారేజ్' షూటింగ్ పూర్తి కావడం కష్టమని, అందువల్లే సెప్టెంబర్ 2న వెళ్లినట్టు తెలుస్తోంది జనతా గ్యారేజ్ రిలీజ్ ఎందుకు వెనక్కి వెళ్లింది? కావాలనే డేట్ ని మేకర్స్ మార్చారా? ఇలా రకరకాల ప్రశ్నలు సోషల్ మీడియాలో రైజ్ అవుతున్నాయి.

అందులోనూ ఆ రోజు హరికృష్ణ బర్త్ డే! ఆగస్టు 12న రిలీజ్ చేస్తే.. వరసగా నాలుగు రోజులు సెలవులు కావడంతో కలెక్షన్స్ పరంగా వర్కవుట్ అవుతుందని ప్లాన్ చేశారు. అయితే షూట్ కాకపోవడంతో అది కాస్ట సెప్టెంబర్ కి వెళ్లిందని అంటున్నారు. అప్పుడు కూడా లాంగ్ వీకెండ్(4 రోజుల సెలవులు) కావడంతో ఆ డేట్ ని ఓకే చేయడం, అదేరోజు హరికృష్ణ పుట్టినరోజు ఇలా అన్నీ కలిసొచ్చాయని అంటోంది యూనిట్. జనతా గ్యారేజ్ రిలీజ్ క్యాన్సిల్ కావడంతో ఆగస్టు 12న నాలుగు సినిమాలు రాబోతున్నట్లు టాక్. వెంకటేష్ నటించిన 'బాబు బంగారం', మరొకటి సాయి ధరమ్ తేజ.. 'తిక్క', మోహన్ లాల్ ఫిల్మ్ 'మనమంతా' కూడా అదేరోజు థియేటర్స్ కి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. మొత్తానికి జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా మరో నాలుగు సినిమాలకు మాంచి రిలీఫ్ అనే మాట వినిపిస్తోంది.

English summary

Why Janatha Garage release date was postponed