అమ్మను ఖననం చేయడానికి అసలు కారణం ఇదే

Why Jayalalithaa was Buried

11:02 AM ON 8th December, 2016 By Mirchi Vilas

Why Jayalalithaa was Buried

తమిళనాట అందరిచేతా అమ్మగా కొలవబడిన తమిళనాడు దివంగత సీఎం జయలలిత భౌతిక కాయానికి అగ్ని సంస్కారం చేస్తారని భావించినా, చివరకు ఖననం చేశారు. ఎందుకంటే, సంప్రదాయ అయ్యంగార్ కుటుంబానికి చెందిన ఆమె భౌతిక కాయాన్ని దహనం చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఎంజీఆర్ సమాధి వద్ద ఖననం చేశారు. దీన్ని టీవీల్లో చూసిన వాళ్ళు , కొందరు సాంప్రదాయ వాదులు ఇలా చేశారేంటి అనుకున్నారు. అయితే ఇలా చేయడంవల్ల అక్కడ ఆమెకు స్మారకం నిర్మించడానికి అనువుగా ఉంటుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడినట్లు సమాచారం.

ఇది కూడా చూడండి: నోట్ల రద్ద యవ్వారంపై ...అద్వానీకి కోపమొ చ్చింది

పైగా అన్నాడీఎంకే పార్టీ ద్రవిడ సిద్ధాంతాల ఆధారంగా నిర్మితమైన పార్టీ. ఆ పార్టీల నేతలను ఇప్పటి వరకూ ఎవరినీ దహనం చేయలేదు. అన్నాదురై, ఎంజీఆర్ లను మెరీనా తీరంలో ఖననం చేశారు. ఇప్పుడు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయలలితను కూడా ఖననం చేయడమే సబబుగా ఉంటుందని పార్టీ వర్గాలు భావించాయి. అన్నా, ఎంజీఆర్ లు మరణించినప్పుడు ఏ తరహా విధానాన్ని, సంప్రదాయాలను పాటించారో జయ విషయంలోనే వాటినే కొనసాగించారు. అప్పట్లో ఆ ఇద్దరు నేతలు మరణించినప్పుడు వారి భౌతికఖాయాలను ప్రజల సందర్శనార్థం రాజాజీ హాలుకు తీసుకొచ్చారు. ఇప్పుడు జయలలిత భౌతిక కాయాన్ని కూడా రాజాజీ హాల్లోనే ప్రజల సందర్శనార్థం ఉంచారు. అక్కడి నుంచీ మెరీనా తీరానికి అంతిమయాత్రగా తీసుకెళ్లి అక్కడ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అదీ అసలు సంగతి.

ఇది కూడా చూడండి: స్మార్ట్ ఫోన్ లేకున్నా జియో ... రిలయన్స్ బంపరాఫర్

English summary

The Reason Behind Why Jayalalithaa was Buried.