ఆ నిజం కట్టప్ప ఇంట్లో తెలిసిపోయింది!

Why Kattappa killed Baahubali answer was revealed in Sathyaraj family

04:33 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Why Kattappa killed Baahubali answer was revealed in Sathyaraj family

'బాహుబలి' చిత్రం తరువాత ఇందులో నటించిన నటీనటులందరికీ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. తమిళ నటుడు సత్యరాజ్‌ ఈ చిత్రం తరువాత 'కట్టప్ప' గా దేశవ్యాప్తంగా పేరొచ్చింది. అయితే సత్యరాజ్‌ తమిళంలో ఒక పెద్ద నటుడు, హీరోగా తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆ తరువాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సత్యరాజ్ మారారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా తెలుగులో గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. దీనితో సత్యరాజ్‌ కి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇది ఒక నటుడికి చాలా గొప్ప గౌరవం. అయితే 'బాహుబలి' చిత్రం తరువాత అందరి మదిలో వచ్చిన ప్రశ్న ఒక్కటే.

అదేంటంటే 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?'. ఈ ప్రశ్నకి సమాధానం మొత్తం సత్యరాజ్ కి తెలుసు, ఇదే ప్రశ్న సత్యరాజ్‌ ఇంట్లోని అడిగారు. కానీ వాళ్లు ఎంతడిగినా సత్యరాజ్‌ వాళ్ల కుటుంబంలో వ్యక్తులకి కూడా చెప్పలేదట. దీని బట్టి సత్యరాజ్‌ కి తన వృత్తి(సినిమాలు) పై ఉన్న డెడికేషన్‌ ఎలాంటిదో అర్ధమౌతుంది. అయితే ఈ విషయం తెలియాలంటే ఇంకా సంవత్సరం వరకు ఎవరైనా ఆగాలి. కానీ ఈ ప్రశ్నకి సమాధానం తన కుటుంబంలో ఒకరికి చెప్పారట. ఆ ఒక్కరూ ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం తెలుసుకోండి మరి... సత్యరాజ్‌ ఆ సమాధానాన్ని తన రెండున్నరేళ్ల మనవడుకి చెప్పేశారట.

ఆశ్చర్యంగా ఉంది కదా, తన మనవడుకి ఎలాగో ఇంకా ఊహ కూడా తెలీదు కాబట్టి సరాదాగా తన దగ్గర చెప్పేశాడట. దీనికి సమాధానం ఎవరికైనా తెలుసుకోవాలనిపిస్తే వాళ్ల మనవడు దగ్గరకి వెళ్లి తెలుసుకోవచ్చు.

English summary

Why Kattappa killed Baahubali answer was revealed in Sathyaraj family. Sathyaraj told that answer to his grand son.