ఆ విషయంలో మగాళ్లు ఎందుకు వెనుకబడుతున్నారో తెలుసా?

Why men will not have operations

01:06 PM ON 13th October, 2016 By Mirchi Vilas

Why men will not have operations

చాలా విషయాల్లో మగవారు.. మగవారే. కానీ ఒక విషయంలో మాత్రం వారు చాలా వెనకే ఉంటున్నారు. మాటల్లో చెప్పలేనంత వేదనను భరించి భార్య పండంటి పిల్లలను కనిస్తే, భర్త మాత్రం చిన్నపాటి కోతకు వణికిపోతున్నాడు. పిల్లలు వద్దనుకున్నపుడు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సనూ భార్యకే తప్పనిసరి చేస్తున్నాడు. ఆరోగ్యానికి, మగతనానికి, పని చేసుకోడానికి, ఏ ఇబ్బందీ లేదని, శస్త్ర చికిత్స కూడా చాలా సులభమని వైద్యులు - నిపుణులు చెబుతున్నా మగాడు ముందుకు రావడం లేదు. ఆ ఇల్లు.. ఈ ఇల్లు.. ఆ ఊరు.. ఈ ఊరు.. ఈ రాష్ట్రం.. ఆ రాష్ట్రం.. ఈ దేశం.. ఆ దేశం.. అని కాదు.. ప్రపంచం మొత్తం ఇదే తంతు నడుస్తోంది. నూటికి ముగ్గురు కూడా వేసక్టమీ(పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స) చేయించుకోడానికి ముందుకు రావడం లేదు.

1/10 Pages

వేసక్టమీ శస్త్ర చికిత్సలపై పురుషులకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు కూడా గట్టిగా ప్రయత్నించడం లేదు. దేశంలో 1.53 లక్షల మంది పురుష ఆరోగ్య కార్యకర్తల అవరసరం. కానీ ఉన్నది మాత్రం కేవలం 55 వేలు మాత్రమేనట. మహిళా ఆరోగ్య కర్తలు 2.12 లక్షల మంది ఉన్నారు.

English summary

Why men will not have operations